రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

గన్ మిస్ ఫైర్..మార్గంమధ్యలో..డీఎస్పీ మృతి

Latest crime news in Telugu, Crime news Telugu, today Crime news, Breaking News Telugu, latest updates in crime news telugu,crime news channels,
Peoples Motivation

గన్ మిస్ ఫైర్..మార్గంమధ్యలో..డీఎస్పీ మృతి

Latest news Gun misfire DSP DIED
భద్రాద్రి కొత్తగూడెం, (పీపుల్స్ మోటివేషన్):-

ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో సీఆర్పీఎఫ్ కు చెందిన అసిస్టెంట్ కమాండెంట్ శేషగిరిరావు మృతిచెందారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81వ బెటాలియన్ లో చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఆయన వద్ద ఉన్న ఏకే 47 తుపాకీ పేలి ఛాతీ కింది భాగంగాలో తూటా దిగింది. అపస్మారక స్థితికి చేరుకున్న శేషగిరిని మిగిలిన జవాన్లు బేస్ క్యాంప్ వద్దకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి 73 కి.మీ దూరంలోని భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో ఆయన మృతిచెందారు. సమీపంలోని అడవిలో కూంబింగ్ కు శేషగిరిరావు వెళ్లారు. తిరిగి వస్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది. శేషగిరిరావు అనంతపురం జిల్లా వాసిగా తెలిసింది.

Comments

-Advertisement-