ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
బేతంచర్ల, ఏప్రిల్ 23 (పీపుల్స్ మోటివేషన్):-
ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పురవీధుల్లో ప్రజాభిమానం వెల్లివిరిసింది. స్థానిక ఎమ్మెల్యేగా డోన్ లో నామినేషన్ అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జోష్ రెట్టింపయింది. సార్వత్రిక బేతంచర్ల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలోనూ మంత్రి బుగ్గన మరింత వేగం పెంచారు. సంక్షేమాభివృద్ధిని సమపాళ్లల్లో చేసి చూపించిన మంత్రి బుగ్గన తమ ముంగిళ్లకు రావడంతో పూల వర్షం కురిపిస్తూ మహిళలు హారతులు పట్టారు. హ్యాట్రిక్ విజయం రాజారెడ్డిదేనంటూ సంతోషంగా నుదుట తిలకం పెట్టి ఆశీర్వదించారు. ఐదేళ్ల పాలనలో రెండేళ్లు కరోనాతో రాష్ట్రం ఇబ్బందులు ఉన్నప్పటికీ మంత్రి బుగ్గన చేసిన అభివృద్ధి అనన్యసామాన్యమంటూ జనం బ్రహ్మరథం పట్టారు. బేతంచెర్ల మున్సిపాలిటీ పరిధిలోని 2వార్డు శేషారెడ్డినగర్, మహాత్మగాంధీనగర్ లో మంగళవారం మంత్రి బుగ్గన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తన ప్రచారంలో భాగంగా ముస్లిం మైనారిటీ మతపెద్ద ఇంటికి మంత్రి బుగ్గన వెళ్లాగా ముస్లింల సంప్రదాయ వస్త్రాలను ఆప్యాయతతో మంత్రికి బహూకరించి అనంతరం మదర్సాలో మంత్రి గెలుపుకోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.ఆయా కాలనిలలో పూలమాలలు వేసి మంత్రి బుగ్గనను అభినందించేందుకు మహిళలు పోటీపడ్డారు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ కొత్తబస్టాండ్ సమీప ప్రాంతాల్లోనూ కలియతిరుగుతూ ప్రభుత్వం చేపట్టిన శాశ్వత అభివృద్ధి పనులను మంత్రి బుగ్గన బేతంచెర్ల ప్రజలకు వివరించారు.సాయంత్రం సంజీవనగర్, హనుమాన్ నగర్ జంగాల్ పేట కాలనీల్లో ప్రచారం చేస్తూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వచ్చే ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి బేతంచెర్ల ముద్దు బిడ్డను ఆశీర్వదించాలని అదేవిధంగా ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మానంద రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బేతంచెర్ల మున్సిపల్ ఛైర్మన్ చలం రెడ్డి, బాబుల్ రెడ్డి, సిహెచ్ లక్ష్మిరెడ్డి, దస్తగిరి, పిట్టల జాకీర్ హుస్సేన్, మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.