పరిగడుపున టీ/కాఫీ తాగుతున్నారా..??
పరిగడుపున టీ/కాఫీ తాగుతున్నారా..??
ఉదయాన్నే టీ తాగకపోతే కొందరు ఏ పని చేయలేరు కానీ ఆ అలవాటు కారణంగా ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు వస్తాయి. పరిగడుపుని టీ తాగితే జీర్ణ క్రియ కు సంబంధించిన ఆమ్లాలకు ఇబ్బంది కలుగుతుంది. ఫలితంగా అరుగుదల శక్తి మందగిస్తుంది. ఉదయాన్నే టీ తీసుకోవడం వల్ల చక్కెరకు నోటిలోని బ్యాక్టీరియా తోడై దంతాలపై ఉండే ఎనామినల్ కూడా దెబ్బతింటుంది. సుమారు ఎనిమిది గంటలు నిద్ర కారణంగా శరీరంలో సహజంగానే నీటి శాతం తగ్గుతుంది. టీ తాగితే ఆ సమస్య మరింత పెరుగుతుంది.
పాలలోని అధిక లాక్టోజ్ మూలంగా పొట్ట ఉబ్బరంగా అనిపిస్తుంది. కొన్నిసార్లు మలబద్ధకం, గ్యాస్ ట్రబుల్ లాంటి సమస్యలు వస్తాయి. పరగడుపున టీ తాగడం వల్ల పైత్యరసం ఉత్పత్తి పై ప్రభావం పడుతుంది. దాంతో వికారంగా అనిపిస్తుంది. అలాగే బ్లాక్ టీ మంచిదే కదా అని అనుకోవద్దు అది తాగిన ఉబ్బరం ఆకలి తగ్గిపోవడం వంటి అనారోగ్యకర లక్షణాలు పెరుగుతాయి. టీలో కెఫిన్ ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే. దాన్ని ఉదయాన్నే శరీరంలో పంపిస్తే మగతగా అనిపిస్తుంది. ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగితే శరీరం సహజంగా ఐరన్ ను సంగ్రహించే శక్తిని కోల్పోతుంది. రక్తహీనత ఉన్నవారు జాగ్రత్త వహించాలి. నిద్ర లేవక ముందే, బ్రెస్ చేసిన వెంటనే టీ తాగే అలవాటు మానుకోవాలి. బ్రేక్ ఫాస్ట్ ముగించిన తర్వాతే తీసుకోవాలి.