వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కి బెయిల్ మంజూరు...
వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కి బెయిల్ మంజూరు...
1996 శిరోముండనం కేసులో సంచలన తీర్పు...
శిరోముండనం కేసులో 18 నెలల జైలు శిక్ష, రూ. 2.50 లక్షల జరిమానా
148 సార్లు వాయిదా...
28 ఏళ్ల తర్వాత వెలువడిన తీర్పు
త్రిమూర్తులు సహా మరో ఐదుగురుకి శిక్ష
విశాఖపట్నం, (పీపుల్స్ మోటివేషన్):-
సంచలనం రేపిన 1996 శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వైకాపా ఎమ్మెల్సీ, మండపేట ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులు సహా ఆరుగురు నిందితులకు న్యాయస్థానం 18 నెలల జైలు శిక్షతో పాటు రూ.2.50 లక్షల జరిమానా విధించింది. ఈ మేరకు న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు.
1996 డిసెంబర్ 29న ప్రస్తుత కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో ఈ ఘటన జరిగింది. ఐదుగురు దళితులను హింసించి ఇద్దరికి శిరోముండనం చేసి గుండు కొట్టించడంతో పాటు కనుబొమ్మలను కూడా తీసేశారు. ప్రస్తుతం కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అప్పట్లో ఈ ఘటన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సంచలనాన్ని రేకెత్తించింది.. 28 ఏళ్లపాటు ఈ కేసు విచారణ కొనసాగగా.. 148 సార్లు వాయిదా పడింది. తోట త్రిమూర్తులు, మరో ఐదుగురిని దోషులుగా తేల్చిన కోర్టు.. వారికి జైలు శిక్ష, జరిమానా విధించింది.
అయితే, ఈ తీర్పు వెలువడిన అనంతరం తోట త్రిమూర్తులు బెయిల్ కు దరఖాస్తు చేసుకున్నారు. అతడి పిటిషన్ ను పరిశీలించిన న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఈసారి ఎన్నికల్లో మండపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.