లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్సై
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్సై
ఆసిఫాబాద్, (పీపుల్స్ మోటివేషన్):-
పోలీస్ స్టేషన్ లో రూ. 25 వేలు లంచం తీసుకుంటూ పట్టుపడ్డ ఎస్సై. కరీంనగర్ ACB డీఎస్పీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి రమణమూర్తి తెలిపిన సమాచారం ప్రకారం.. ఆసిఫాబాద్ మండలంలోని బూరుగూడలో గత నెల 31న ఓ కారు, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ కేసు విషయంలో స్టేషన్ బెయిల్ కోసం ఎస్సై రాజ్యలక్ష్మి రూ.40 వేల లంచం డిమాండ్ చేశారు. కారు యజమాని యాహియాఖాన్ అంత ఇచ్చుకోలేనని చెప్పడంతో చివరకు రూ.25 వేలకు ఒప్పుకొన్నారు. బాధితుడు ఈ సమాచారాన్ని ACB అధికారులకు చెప్పడంతో వాళ్ళు సూచించిన మేరకు సోమవారం పోలీస్ స్టేషన్ లో ఎస్సైకి రూ.25 వేలు ఇస్తుండగా ACB డీఎస్పీ రమణమూర్తి ఇతర పోలీసు అధికారులతో వచ్చి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొన్నారు. నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. ఎస్సైని కరీంనగర్ ACB కోర్టులో హాజరుపర్చనున్నట్లు తెలిపారు.