పోలింగ్ రోజున హెల్పర్స్ గా విధులు నిర్వహించాలనుకున్న ఎన్ సీసీ, మాజీ సైనిక ఉద్యోగులు, రిటైర్డ్ పోలీసుల పేర్లను వారం రోజుల లోపల నమోదు చేసుకోండి
పోలింగ్ రోజున హెల్పర్స్ గా విధులు నిర్వహించాలనుకున్న ఎన్ సీసీ, మాజీ సైనిక ఉద్యోగులు, రిటైర్డ్ పోలీసుల పేర్లను వారం రోజుల లోపల నమోదు చేసుకోండి
కర్నూలు, ఏప్రిల్ 15 (పీపుల్స్ మోటివేషన్):-
పోలింగ్ రోజున హెల్పర్స్ గా విధులు నిర్వహించాలనుకున్న ఎన్ సీసీ (నేషనల్ క్యాడిట్ కార్ప్స్) మాజీ సైనిక ఉద్యోగులు, రిటైర్డ్ పోలీసులు వారి పేర్లను వారం రోజుల లోపల నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన పేర్కొన్నారు.
సోమవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో సాధారణ ఎన్నికలు 2024 సందర్భంగా ఎన్ సీసీ (నేషనల్ క్యాడిట్ కార్ప్స్) మాజీ సైనిక ఉద్యోగులు, రిటైర్డ్ పోలీసులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సాధారణ ఎన్నికలు 2024 సందర్భంగా పోలింగ్ రోజున పోలింగ్ స్టేషన్ ల నందు హెల్పర్లుగా విధులు నిర్వహించాలనుకున్న ఎన్ సీసీ (నేషనల్ క్యాడిట్ కార్ప్స్,) మాజీ సైనికు ఉద్యోగులు, రిటైర్డ్ పోలీసు లు వారి పేర్లను వారం రోజు లోపల సమర్పించాలన్నారు. ఎన్సిసి, విద్యార్థి సంఘాల వారు ఎలాంటి రాజకీయ పార్టీలకు సంబంధం లేని వారుగా ఉండాలని 15-16 సంవత్సరాల వయసు గల వారై ఉండాలని కలెక్టర్ తెలియజేశారు. ప్రైవేట్ సెక్యూరిటీ వారిని కూడా వినియోగించుకోవడం జరుగుతుందని కలెక్టర్ తెలియజేశారు. నమోదైన పేర్లను పోలీస్ శాఖ వారి ద్వారా పరిశీలించడం జరుగుతుందన్నారు. సంబంధిత హెల్పర్స్ ను పోలింగ్ సిబ్బందితో పాటు తీసుకొని వెళ్లడంతో పాటు భోజన సదుపాయం కూడా కల్పిస్తామన్నారు. నడవలేని ఓటర్లను హెల్పర్స్ వీల్ చైర్ ద్వారా తీసుకురావాల్సి ఉంటుందని, ఓటు వేయడానికి వచ్చిన వృద్ధులకు కూడా సహాయకారిగా ఉండవలసి ఉంటుందన్నారు. విధులు నిర్వహించే హెల్పర్స్ కు పారితోషకం కూడా ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్ తెలియజేశారు.
కార్యక్రమంలో డిఆర్ఓ కే మధుసూదన్ రావు, ఎన్నికల సూపరిండెంట్ మురళి, సైనిక వెల్ఫేర్ అధికారి, ఎన్ సీసీ (నేషనల్ క్యాడిట్ కార్ప్స్) మాజీ సైనిక ఉద్యోగులు, రిటైర్డ్ పోలీసులు తదితరులు పాల్గొన్నారు.