1952 తొలి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గుర్తు ఏదో తెలుసా..!
1952 తొలి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గుర్తు ఏదో తెలుసా..!
దేశంలో ఇప్పటి వరకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటూ వచ్చాయి. పోటీ చేసిన రాజకీయ పార్టీల గుర్తుల్లో సైతం. మార్పులొచ్చాయి. 1952లో తొలిసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గుర్తు కాడెడ్లు. ఈ గుర్తుతోనే దేశంలోని పలు లోక్సభ, అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసింది. ఆ తర్వాత పార్టీ చీలిపోయి కాంగ్రెస్ (ఇందిరా)గా ఏర్పడింది. అప్పుడు ఆ పార్టీకి ఆవు, దూడ గుర్తు కేటాయించారు. ఇదే గుర్తుతో 1971 ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ తర్వాత చీలిపోయిన కాంగ్రెస్ విలీనమై భారత జాతీయ కాంగ్రెస్ పేరుతో ఏర్పడింది. అప్పుడు హస్తం గుర్తును కేటాయించారు. 1977 నుంచి హస్తం గుర్తుతో కాంగ్రెస్ ఎన్నికల బరిలో నిలుస్తోంది.
పీడీఎఫ్ కు మొదట హస్తం గుర్తు :
1952 సార్వత్రిక ఎన్నికల సమయంలో కమ్యూనిస్టు పార్టీపై నిర్బంధం ఉండడంతో పీడీఎఫ్ పేరుతో బరిలో నిలిచారు. వీరికి స్వతంత్ర అభ్య ర్షికి కేటాయించే హస్తం గుర్తును కేటాయించారు. ఆ తర్వాత సీపీఐకి కంకి, కొడవలి, సీపీఎంకు సుత్తి, కొడవలి, నక్షత్రం గుర్తులను కేటా యించారు. ఇవే గుర్తులతో ఆయా పార్టీల అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలుస్తున్నారు.
బీజేపీ ఎన్నికల గుర్తు:
బీజేపీ ఎన్నికల గుర్తు కూడా కొన్నేళ్లుగా మారిపోయింది. 1951 నుండి 1977 వరకు, బిజెపి (పూర్వపు భారతీయ జనసంఘ్ ) దాని ఎన్నికల చిహ్నంగా నూనె దీపాన్ని కలిగి ఉంది. 1977లో ఇతర రాజకీయ పార్టీలతో కలిసి జనతా పార్టీని ఏర్పాటు చేసినప్పుడు, దానికి ప్రాతినిధ్యం వహించడానికి రైతు మరియు నాగలి గుర్తును ఎంచుకుంది. మూడు సంవత్సరాల తరువాత, జనతా పార్టీ రద్దు చేయబడి, బిజెపిని స్థాపించినప్పుడు, కమలం దాని ఎన్నికల చిహ్నంగా స్వీకరించబడింది.