తెలంగాణ 'దోస్త్-2024' నోటిఫికేషన్
తెలంగాణ 'దోస్త్-2024' నోటిఫికేషన్
తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి- రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన 'డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) 2024' నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా జేఎన్టీయూ హెచ్, ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, శాతవాహన, మహాత్మా గాంధీ యూనివర్శిటీల అనుబంద కళాశాలలతోపాటు తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంలోనూ అడ్మిషన్స్ ఇస్తారు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీబీఎం, బీసీఏ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు, తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నిర్వహించే పాలిటెక్నిక్ డిప్లొమా ప్రోగ్రామ్ లు పూర్తిచేసినవారు, కంపార్ట్ మెంటల్ ద్వారా పాసైనవారు దరఖాస్తు చేసుకోవచ్చు. మూడు విడతల్లో ప్రవేశ ప్రక్రియ నిర్వహిస్తారు.
దోస్త్ 2024 షెడ్యూల్
ఫేజ్-1
దరఖాస్తు ఫీజు: రూ. 200
రిజిస్ట్రేషన్: 06 మే నుంచి 25 మే వరకు
వెబ్ ఆప్షన్స్: 15 మే నుంచి 27 మే వరకు
స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్: 24, 25 మే
సీట్ అలాట్మెంట్: 03 జూన్
ఆన్లైన్ సెల్స్ రిపోర్టింగ్ : 04 జూన్ నుంచి 10 జూన్ వరకు
ఫేజ్-2
దరఖాస్తు ఫీజు: రూ. 400
రిజిస్ట్రేషన్: 04 జూన్ నుంచి 13 జూన్ వరకు
వెబ్ ఆప్షన్స్: 04 జూన్ నుంచి 14 జూన్ వరకు
స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్: జూన్ 13
సీట్ అలాట్మెంట్: జూన్ 18
ఆన్లైన్ సెల్స్ రిపోర్టింగ్ : జూన్ 19 నుంచి జూన్ 24 వరకు
ఫేజ్-3
దరఖాస్తు ఫీజు: రూ. 400
రిజిస్ట్రేషన్: 19 జూన్ నుంచి 25 జూన్ వరకు
వెబ్ ఆప్షన్స్: 19 జూన్ నుంచి 26 జూన్ వరకు
స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్: జూన్ 25
సీట్ అలాట్మెంట్: జూన్ 29
ఆన్లైన్ సెల్స్ రిపోర్టింగ్ : జూన్ 29 నుంచి జూలై 03 వరకు
అదనపు సమాచారం
కళాశాలలో అభ్యర్థుల రిపోర్టింగ్: జూన్ 24 నుంచి జూలై 05 వరకు
స్టూడెంట్స్ ఓరియంటేషన్: జూలై 01 నుంచి జూలై 06 వరకు
మొదటి సెమిస్టర్ ప్రారంభం: జూలై 08 నుంచి
మిగతా సమాచారం కొరకు కింది వెబ్సైట్ ను సందర్శించగలరు.