సెక్షన్ 49(పి) ద్వారా ఓటు..టెండర్డ్ ఓటు అంటే ఏమిటి?
సెక్షన్ 49(పి) ద్వారా ఓటు..టెండర్డ్ ఓటు అంటే ఏమిటి?
సెక్షన్ 49(పీ) ద్వారా ఓటు పొందాలనుకునేవారు ముందుగా ప్రిసైడింగ్ అధికారిని కలవాలి. ఓటు కోల్పోయిన వ్యక్తి మనమేనని ఆయన ముందు నిరూపించుకోవాలి. అందుకోసం ఓటరు గుర్తింపు కార్డు లేదా ఇతర గుర్తింపు పత్రాలను సమర్పించాలి. ఎన్ఆర్ఐ లు అయితే.. పాస్ పోర్టు చూపించాలి. అప్పుడు ప్రిసైడైంగ్ అధికారి ఇచ్చే ఫామ్ 17(బీ)లో పేరు, సంతకం చేసి ఇవ్వాలి.
అప్పుడు వెనుకవైపు తన సంతకంతో ఉన్న టెండర్డ్ బ్యాలెట్ పేపరను ప్రిసైడింగ్ అధికారి మనకు ఇస్తారు. దానిపై మనకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేసి తిరిగి ప్రిసైడింగ్ అధికారికి ఇవ్వాలి. ఆయన ప్రత్యేక కవర్లో ఆ ఓటును భద్రపరిచి కౌంటింగ్ కేంద్రానికి పంపిస్తారు. సెక్షన్ 49(పి) ద్వారా పొందే ఓటు హక్కును ఈవీఎం ద్వారా వేసేందుకు అనుమతి ఇవ్వరు. 49(పి) సెక్షన్ ద్వారా పొందే ఓటు హక్కును టెండర్డ్ ఓటు అని పిలుస్తారు. మొత్తం ఓట్లలో ఈ ఓటును అదనపు ఓటుగా గుర్తిస్తారు. కౌంటింగ్ రోజున మిగతా ఓట్లును లెక్కించిన తర్వాతనే ఈ ఓటుకు ప్రాధాన్యత ఉంటుంది. గెలుపు ఓటముల్లో ఈ ఓటు అవసరాన్ని బట్టి దానిని పరిగణనలోకి తీసుకుంటారు. ఈ ఓటు ద్వారా. సాధ్యమవుతుందని భావించినప్పుడు మాత్రమే ఈ ఓటును లెక్కిస్తారు.
ఎన్నికల పోలింగ్ రోజున దొంగ ఓట్ల వల్ల లేక ఇతర కారణాలతో ఓటు హక్కు కోల్పోయే పరిస్థితి వచ్చినప్పుడు తిరిగి దాన్ని సాధించుకునే హక్కును భారత ఎన్నికల సంఘం 1961లో తీసుకొచ్చిన సెక్షన్ 49(పి) అవకాశం కల్పిస్తోంది