రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ఓటర్లు మొబైల్ ఫోన్లు పోలింగ్ కేంద్రం లోకి తీసుకొని వెళ్ళకూడదు

election time from 7 a.m. to 6 pm what is the maximum distance to a polling station election rules for voters voting time Election rules of voters
Peoples Motivation

ఓటర్లు మొబైల్ ఫోన్లు పోలింగ్ కేంద్రం లోకి తీసుకొని వెళ్ళకూడదు

జిల్లాలోని ఓటర్లందరూ మే 13 వ తేదిన పోలింగ్ లో పాల్గొని ఓటు హక్కును వినియోగించుకోవాలి

అన్ని పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాం

జిల్లాలో 100 శాతం వెబ్ కాస్టింగ్ అమలు

జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ డా జి.సృజన

Kurnool District collector Dr G.Srujana IAS, KURNOOL DISTRICT SP KRISHNAKANTH IPS, TRAINE COLLECTOR CHALLA KALYANI
కర్నూలు, మే 09 (పీపుల్స్ మోటివేషన్):-

జిల్లాలోని ప్రజలందరూ మే 13 వ తేది పెద్ద ఎత్తున పోలింగ్ లో పాల్గొని ఓటు హక్కును వినియోగించుకొని ఓటింగ్ శాతాన్ని పెంచడంతో పాటు, ఓటు గోప్యతకు భంగం కలిగించకుండా మొబైల్ ఫోన్లను పోలింగ్ కేంద్రాలలోకి తీసుకొని రాకూడదని జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ డా జి.సృజన పేర్కొన్నారు. 

గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో ఎన్నికల సన్నద్ధతపై ఎస్పీ కృష్ణ కాంత్ తో కలిసి జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ డా జి.సృజన జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఆక్సిలియారి పోలింగ్ కేంద్రాలతో కలిపి మొత్తం 2,204 పోలింగ్ కేంద్రాలున్నాయని, ఇప్పటికే అన్ని పోలింగ్ కేంద్రాల్లో ర్యాంప్, త్రాగునీరు, టాయిలెట్స్ విత్ రన్నింగ్ వాటర్, తదితర మౌలిక సదుపాయాలను కల్పించామని, పోలింగ్ రోజున ప్రతి పోలింగ్ కేంద్రంలో షెడ్, కుర్చీలు, త్రాగునీరు, పోలింగ్ జరుగుతున్న రూమ్ లలో రెండ్ లైట్స్ , ఫ్యాన్ ఉండే విధంగా తగిన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు.. 

1096 లొకేషన్ లలో 2,204 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, ప్రతి లొకేషన్ లో కూడా కనీసం ఒక వీల్ చైర్ ఉంటుందని, 3 కంటే ఎక్కువ పోలింగ్ కేంద్రాలు ఒక్కటే లొకేషన్ లో ఉన్నట్లయితే 2 వీల్ చైర్లు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామని వాటిని హ్యాండిల్ చేయుటకు ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.. 

ప్రతి పోలింగ్ కేంద్రంలో మహిళలు, పురుషులకు ప్రత్యేకంగా క్యూ లైన్లను ఏర్పాటు చేయబడుతాయని, ఒకవేళ క్యూ లైన్లలో వయోవృద్ధులు, విభిన్న ప్రతిభావంతులు, గర్భిణీ స్త్రీలు వెనుక ఉన్నట్లయితే వారికి ప్రాముఖ్యతను ఇస్తూ క్యూ లైన్లలో నిలబడకుండా త్వరగా వారి ఓటు హక్కును సద్వినియోగం చేసుకునే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

1096 పోలింగ్ లొకేషన్ లలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందని మెడికల్ క్యాంప్ లో ఓఆర్ఎస్, డయాబెటిస్, బిపి, పారాసెటమాల్ మాత్రలు, ఫస్ట్ ఎయిడ్ లో ఉండలవాల్సిన అన్ని రకాల మెడిసిన్స్ ను మెడికల్ క్యాంప్ లో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. 

పోలింగ్ కేంద్రాల లోపలికి మొబైల్ ఫోన్లు తీసుకొని వెళ్ళకూడదని, ప్రజలు కూడా ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని మొబైల్ ఫోన్లు తీసుకొని రాకుండా ఉండాలన్నారు. 

అన్ని పోలింగ్ కేంద్రాల్లో 100 శాతం వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు..పోలింగ్ కేంద్రాల బయట ఒక కెమెరా, పోలింగ్ కేంద్రం లోపల మరొక్క కెమెరా ఉంటుoదని, సిసి కెమెరా ల పర్యవేక్షణలో పోలింగ్ కేంద్రం బయట, లోపల ఉంటుoదని కలెక్టర్ పేర్కొన్నారు. 

కర్నూలు జిల్లాలో 20 లక్షల 54 వేల 563 మంది ఓటర్లు ఉన్నారని అందులో పురుషులు 10 లక్షల 13 వేల 794 మంది, స్త్రీలు 10 లక్షల 40 వేల 451 మంది, ట్రాన్స్ జెండర్లు 318 మంది ఉన్నారని రాష్ట్రంలో అత్యధికంగా ఓటర్లు కర్నూలు జిల్లాలో ఉన్నారని కలెక్టర్ పేర్కొన్నారు.... సంబంధిత వారందరికీ కూడా ఓటర్ స్లీప్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుందని, పెండింగ్ లో ఉన్న 45 వేల ఓటర్ స్లిప్ లను శుక్రవారం మధ్యాహ్నం నాటికి పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.

ఇప్పటివరకు 3 లక్షల 34 వేల ఎపిక్ కార్డులను ఇవ్వడం జరిగిందని, పెండింగ్ లో ఉన్న 9 వేల ఎపిక్ కార్డు లను కూడా 2 రోజులలో పంపిణీ చేసేందుకు చర్యలు చేపడతామని, ఎపిక్ కార్డు లు లేని పక్షంలో వారు ఓటర్ ఐతే ఎన్నికల కమిషన్ వారు 12 ప్రత్యామ్నాయ ఫోటో గుర్తింపు పత్రాలను అనుమతిస్తారని కలెక్టర్ పేర్కొన్నారు.

2,204 పోలింగ్ కేంద్రాలలో కూడా ప్రతి మండలానికి ఒక్కటి చొప్పున మోడల్ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుందని, అదే విధంగా 30 ఏళ్ల వయసు లోపల ఉండే వారు నిర్వహించే 2 యూత్ పోలింగ్ కేంద్రాలు, పోలింగ్ మొత్తం మహిళ సిబ్బంది నిర్వహించే 8 మహిళ పోలింగ్ కేంద్రాలు, పోలింగ్ మొత్తం వికలాంగులు నిర్వహించే 2 వికలాంగ పోలింగ్ కేంద్రాలను ఈ విధంగా మొత్తం 3 రకాల ప్రత్యేక పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. 

పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి హోం ఓటింగ్ లో 997 మందికి గాను ఈరోజు మధ్యాహ్నం 1 గంట వరకు 926 మంది వినియోగించుకున్నరని, పెండింగ్ లో ఉన్న 73 మంది కూడా ఈరోజు వినియోగించుకుంటారని కలెక్టర్ పేర్కొన్నారు. 

ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది మొత్తం 21 వేల 11 మందికి గాను ఈరోజు మధ్యాహ్నం 1 గంట వరకు 17 వేల 813 మంది వినియోగించుకున్నారని, ఎసెన్షియల్ సర్వీసెస్ కి సంబంధించి 1604 మంది దరఖాస్తు చేసుకోవడం జరిగిందని అందులో మధ్యాహ్నం 1 గంట వరకు 1220 మంది వినియోగించుకున్నారని, పెండింగ్ లో ఉన్నవారిలో ఎంతమంది వినియోగించుకున్నారనే వివరాలను కూడా సాయంత్రం నాటికి చెప్పడం జరుగుతుందన్నారు. ఈరోజు సాయంత్రం 5 నాటికి పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును వినియోగించుకోని యెడల వారి చేతికి పోస్టల్ బ్యాలెట్ ఇవ్వడం జరగదని కలెక్టర్ స్పష్టం చేశారు. 

ఎస్పీతో కలిసి పరిశీలన చేసి 18 వల్నరబుల్ పోలింగ్ కేంద్రాలను, 320 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించడం జరిగిందని, సంబంధిత పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ తో పాటు మైక్రో అబ్జర్వర్లు, వీడియోగ్రఫీ ఉంటుందన్నారు. 1 పోలింగ్ లొకేషన్ లో 3 కంటే ఎక్కువ పోలింగ్ కేంద్రాలు ఉన్న తరుణంలో 2 మైక్రో అబ్జర్వర్లను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. సంబంధిత పోలింగ్ కేంద్రాల ప్రాంతాల వద్దకు ఎస్పీ తో వెళ్లి అక్కడ ఉండే ప్రజలకు ఓటు హక్కు పై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. 

ఎన్నికలకు సంబంధించిన ట్రాన్స్పోర్ట్ వాహనాలను గుర్తించడం జరిగిందని, పోలింగ్ మెటీరియల్, ఈవిఏం మెషీన్ తీసుకొని వెళ్ళే వాహనాలలో ఖచ్చితంగా జిపిఎస్ ట్రాక్ ను అమర్చడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు.. అందుకు సంబంధించిన కంట్రోల్ రూం కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.. 

ప్రతి పోలింగ్ కేంద్రంలో నెట్వర్క్ పని చేస్తుందో లేదో నెట్వర్క్ సర్వే చేయించడం జరిగిందని 8 పోలింగ్ కేంద్రాల లోపల ఏ నెట్వర్క్ పని చేయనందున, వాటిలో వి హెచ్ ఎఫ్ సెట్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 

పోలింగ్ విధులలో పాల్గొనే సిబ్బంది అందరికీ ఇప్పటికే 3 సార్లు శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగిందన్నారు. పోలింగ్ సిబ్బంది కి సంబంధించిన 3 వ ర్యాండమైజేషన్ ఈ నెల 11 వ తేది అబ్జర్వర్ల సమక్షంలో జరుగుతుందన్నారు. 

పోలింగ్ రోజున ఎంతవరకు పోలింగ్ జరిగింది, ఎక్కడైనా సమస్యలు వచ్చాయా అనే విషయాలను సెక్టార్ అధికారుల ద్వారా తెలుసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లాలో 232 సెక్టార్ అధికారులు ఉన్నారని కలెక్టర్ తెలిపారు. కంట్రోల్ రూం నుండి వెబ్ కాస్టింగ్ ద్వారా ప్రతి పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షణ చేయడం జరుగుతుందన్నారు. ప్రతి నియోజకవర్గానికి 3 బెల్ ఇంజనీర్లను కేటాయించడం జరిగిందని ఏదైనా మిషన్ పని చేయకపోయినా, కనెక్ట్ చేయుటకు రాకపోయినా, సాంకేతిక సమస్యలు వచ్చిన వాటిని సరి చేయుటకు బెల్ ఇంజనీర్లు అందుబాటులో ఉంటారన్నారు. 

జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ మాట్లాడుతూ.. జిల్లాలో 18 వల్నరబుల్ పోలింగ్ కేంద్రాలను, 320 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించడం జరిగిందని, సంబంధిత పోలింగ్ కేంద్రాల ప్రాంతాల వద్దకు వెళ్లి ఫ్లాగ్ మార్చి నిర్వహించడంతో పాటు, అక్కడ ఉండే ప్రజలకు ఓటు హక్కు పై అవగాహన కల్పించి ఓటు వేయాలని వారి ధైర్యాన్ని తీసుకొని రావడం జరిగిందన్నారు. ఫ్యాక్షన్ ఉన్న గ్రామలలో కూడా ఫ్లాగ్ మార్చి నిర్వహించడం జరిగిందని ఇప్పటివరకు 1775 గ్రామాల్లో ఫ్లాగ్ మార్చి నిర్వహించడంతో పాటు నైట్ హాల్ట్ ఉండి సంబంధిత గ్రామాల్లో ఉండే ప్రజలకు ఓటు హక్కు మీద అవగాహన కల్పించడంతో పాటు ఓటు వేసే వారికి ఎవరైనా ఇబ్బంది కలిగిస్తే అటువంటి వారి మీద తీసుకునే చర్యల గురించి కూడా అవగాహన కల్పించడం జరిగిందన్నారు. అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు 5 వేల మంది మీద బైండోవర్ కేసులను పెట్టడం జరిగిందన్నారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు గాను అన్ని రకాల బందోబస్తు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. పోల్ డే ప్రీ పోల్ డే రోజున తీసుకోవాల్సిన భద్రత చర్యలను అన్నిటిని ప్లాన్ చేసుకోవడం జరిగిందన్నారు. పోలింగ్ పూర్తైన తర్వాత సంబంధిత ఎన్నికల మెటీరియల్ ను స్ట్రాంగ్ రూమ్ కి తరలించుటకు గాను క్యూఆర్టి, రూట్ మొబైల్ టీమ్ లు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని వివరించారు. 

విలేకరుల సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి పాల్గొన్నారు.

Comments

-Advertisement-