ప్రజల భూములను కాజేసేందుకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్
ప్రజల భూములను కాజేసేందుకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్
వైసీపీ కి ఓటు వేస్తే మన భూములు పోతాయి
టీడీపీ అధికారంలోకి వస్తేనే మన భూములు సురక్షితంగా ఉంటాయి..
గ్రామాలు కనీస మౌలిక సదుపాయాలు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు..
- కర్నూలు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు
కోడుమూరు, మే 09 (పీపుల్స్ మోటివేషన్):-
కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గ లో కర్నూలు పార్లమెంట్ కూటమి అభ్యర్థి బస్తిపాటి నాగరాజు విస్తృతంగా ఎన్నికల ప్రచారాలు నిర్వహించారు.. కోడుమూరు సీనియర్ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి, కోడుమూరు అసెంబ్లీ కూటమి అభ్యర్థి బొగ్గుల దస్తగిరిలతో కలిసి నియోజకవర్గంలోని నిడ్జూరు, జి.శింగవరం, బాంపురం , తులసిపురం, మునగలపాడు, బి.తాండ్రపాడు గ్రామాల్లో నాగరాజు కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ప్రచారం చేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆస్తులను కాజేసేందుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్టుతో జగన్ పన్నాగం పన్నుతున్నాడని ఆరోపించారు..వైసీపీ పార్టీకి ఓటు వేస్తే మన ఆస్తులు పోతాయని హెచ్చరించారు.. మన ఆస్తులు సురక్షితంగా ఉండాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలన్నారు.. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ను రద్దు చేస్తామని స్పష్టం చేశారు.. వైసీపీ అవినీతి పాలనలో ఆ పార్టీ నాయకులు అభివృద్ధి చెందారు తప్పా, ఏ ప్రాంతం అభివృద్ధి చెందలేదని మండిపడ్డారు...గ్రామాలు కనీస మౌలిక సదుపాయాలకు నోచుకోక ఐదేళ్ల పాటు పల్లె ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారన్న నాగరాజు..తనను ఎం.పీ గా గెలిపిస్తే గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు..