ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి
ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి : ఏఐఎస్ఎఫ్
డోన్, మే 17 (పీపుల్స్ మోటివేషన్):-
డోన్ పట్టణంలో ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలైన శ్రీ చైతన్య, నారాయణ, శ్రీ సుధా కళాశాలపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు సూర్య ప్రతాప్ శుక్రవారం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికల హడావిడి ఉండగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల బుద్ధి నిరూపించుకుంటున్నాయని వీటి పైన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా మడుపులు తీసుకొని ప్రవేట్ కార్పోరేట్ విద్యాసంస్థలను గాలికి వదిలేశారు అని అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభం కాకముందే ప్రైవేటు విద్యాసంస్థలు కలర్ కలర్ పత్రాలు , ఫ్లెక్సీలు తయారు చేసుకుని ఆ విద్యాసంస్థలలో పనిచేసే ఉపాధ్యాయులకు మీరు అడ్మిషన్లు తీసుకుని రాకుంటే మీకు జీతాలు ఇవ్వమని బెదిరిస్తూ వారిని గ్రామాల చుట్టూ తిప్పుతూ ముందస్తు అడ్మిషన్స్ నిర్వహించుకుంటూ ఇప్పుడు జరిగితే ఒక ఫీజు పాఠశాల ప్రారంభించిన తర్వాత చేరితే మరొక ఫీజు ఉంటుందని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తూ దోపిడీ చేస్తున్నారని ఆయన తెలిపారు. అనంతరం పాఠ్యపుస్తకాల అమ్ముకుంటూ ఆర్థిక దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి వారి పై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు లేని పక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కళాశాలల ఎదుట ప్రత్యక్ష ఆందోళనలు చేపడతామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ కార్యవర్గ సభ్యులు మనోజ్, శశిధర్ రెడ్డి, వంశీ, ఈశ్వర్, సిద్ధార్థ, సురేంద్ర , ధర్మతేజ తదితరులు పాల్గొన్నారు.