జంట నగరాల్లో ఆరు చోట్ల ఏసీబీ సోదాలు..
ACB RIDES in Hyderabad
ACB RIDES on acp uma maheshwarao
Ap ACB RIDES
Ts ACB RIDES
Latest news headlines
LATEST Telugu News
Latest govt jobs
TS TET
AP
By
Peoples Motivation
జంట నగరాల్లో ఆరు చోట్ల ఏసీబీ సోదాలు..
ఏసీపీ ఉమామహేశ్వరరావు నివాసంలో రైడ్
ఆయన స్నేహితులు, బంధువుల ఇళ్లకూ వెళ్లిన అధికారులు
ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలు
తెల్లవారుజామున ఐదు గంటలకే రైడ్స్ మొదలు పెట్టిన అధికారులు
హైదరాబాద్ (పీపుల్స్ మోటివేషన్):-
ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావుపై ఆరోపణలు రావడంతో యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ) అధికారులు హైదరాబాద్ లో రెయిడ్స్ చేపట్టారు. హైదరాబాద్ లోని ఏసీపీ స్నేహితులు, బంధువుల ఇళ్లకూ వెళ్లిన అధికారులు మొత్తంగా సిటీలో ఆరుచోట్ల సోదాలు చేస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున ఐదు గంటలకే ఆశోక్ నగర్ లోని ఏసీపీ ఉమామహేశ్వరరావు నివాసానికి అధికారులు చేరుకున్నారు. ఏసీపీ నివాసంలో సోదాలు చేపట్టారు. ఆయన ఆస్తుల వివరాలు, సర్వీసు రికార్డు, ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తున్నారు.
రాష్ట్రంలోని మరో నాలుగు చోట్ల ఏకకాలంలో రెయిడ్స్ చేపట్టారు. ఏసీపీ ఉమామహేశ్వరరావు ప్రస్తుతం సాహితీ ఇన్‌ఫ్రా కేసులను విచారణ జరుపుతున్నారు. గతంలో ఇబ్రహీంపట్నం ఏసీపీగా పనిచేసినప్పటి నుంచే ఉమామహేశ్వరరావుపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. డబుల్ మర్డర్ నిందితుడు మట్టారెడ్డి నుంచి ముడుపులు తీసుకున్నారని ఉమామహేశ్వరరావుపై అభియోగాలు ఉన్నాయి.
Comments