రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ఇసుక అక్రమ తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు తప్పవు

Kurnool District news Sand reaches visit collector Kurnool election news Election results General Election results Sand mafia news Intresting facts
Peoples Motivation

ఇసుక అక్రమ తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు తప్పవు

అక్రమ తవ్వకాలను అడ్డుకునేందుకు ఇసుక రీచ్ లలో సిసి కెమెరాలు ఏర్పాటు

వాల్ట యాక్ట్ ప్రకారం నీటిని తొలగించడం చట్ట విరుద్ధం

ఇసుక రీచ్ లను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డా.జి.సృజన

Kurnool District collector Dr G Srujana Visit Sand Reaches

కర్నూలు, మే 20 (పీపుల్స్ మోటివేషన్):-

న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను పాటించకుండా ఇసుకను అక్రమ తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన తెలిపారు.

సోమవారం సి.బెలగల్ మండలంలోని కె.సింగవరం, ఈర్లదిన్నె, ముడుమాల, పల్దొడ్డి గ్రామాలలోని ఇసుక రీచ్ లను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు.

Kurnool District collector Dr G Srujana Visit Sand Reaches

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇసుక అక్రమ తవ్వకాలను ఎప్పటికప్పుడు అడ్డుకునేందుకు ఇసుక రీచ్ లలో సిసి కెమరాలను ఏర్పాటు చేయాలన్నారు. అంతేకాకుండా పోలీసు, రెవెన్యూ సిబ్బంది సమన్వయం చేసుకుంటూ క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేయాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అక్రమ ఇసుక తవ్వకాలు జరపకూడదని అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వాహనాలను కూడా సీజ్ చేయడం జరుగుతుందన్నారు. అదే విధంగా పల్దొడ్డి గ్రామంలోని తుంగభద్ర నది తీరంలోని ఇసుక రీచ్ లో మోటర్లు ఉండటం గమనించిన జిల్లా కలెక్టర్ వాల్ట యాక్ట్ చట్ట ప్రకారం మోటర్ల ద్వారా నీటిని తొలగించడం చట్ట విరుద్ధం అని వెంటనే సదరు మోటర్లను తొలగించాలని కలెక్టర్ సి.బెళగల్ తహశీల్దార్ ను అదేశించారు. జిల్లా కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ చల్లా కళ్యాణి, కర్నూలు ఆర్డీఓ శేషిరెడ్డి, ఇరిగేషన్ ఎస్ఈ రెడ్డి శేఖర్ రెడ్డి, మైనింగ్ డిడి రాజశేఖర్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ నాగేశ్వర రావు, విజిలెన్స్, భూగర్భ జలశాఖ అధికారి, రెవెన్యూ సిబ్బంది తదితరులు ఉన్నారు.

Comments

-Advertisement-