SR Jr College# ప్రభుత్వం నిబంధనలు తుంగలో తొక్కిన ఎస్ ఆర్ కళాశాల గుర్తింపును రద్దు చేయాలి
SR Jr College# ప్రభుత్వం నిబంధనలు తుంగలో తొక్కిన ఎస్ఆర్ కళాశాల గుర్తింపును రద్దు చేయాలి: ఏఐఎస్ఎఫ్
కర్నూలు, మే 23 (పీపుల్స్ మోటివేషన్):-
కర్నూల్ లోని తాండ్రపాడు వద్ద ఉన్న ఎస్ ఆర్ కళాశాల గుర్తింపును రద్దు చేయాలని అఖిల భారత యువజన సమైక్య జిల్లా అధ్యక్షుడు డి సోమన్న గురువారం డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఎస్సార్ కళాశాల యాజమాన్యం కర్నూలు పట్టణం నడిబొడ్డున గాంధీనగర్ లోపల ఉన్నటువంటి పని పూర్తికాని బిల్డింగ్ లో ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా అక్రమంగా అడ్మిషన్లు క్లాసులు నిర్వహించుకుంటూ ఉన్నా.. ఇంటర్మీడియట్ ఆర్ ఐ ఓ ఏమాత్రం చూసి చూడనట్టు ఆర్ఐఓ ఆఫీసులో రూమ్ కి మాత్రమే పరిమితమయ్యారని విద్యార్థుల భవిష్యత్తును ఏమాత్రం పట్టించుకోవడంలేదని అటువంటి ఆర్ఐఓ ని అలాగే అక్రమంగా ఇప్పటికే హాస్టల్స్ ను కూడా నడుపుతున్నటువంటి ఎస్ఆర్ జూనియర్ కళాశాల మీద క్రిమినల్ కేసులు బనాయించాలని ఆయన కోరారు. జిల్లా శాఖ అధికారులు ఎస్సార్ కళాశాల మీద చర్యలు తీసుకోకపోతే ఆర్ఐఓ ఆఫీస్ ను ముట్టడించి విద్యార్థులను తామే రేపటి నుంచి బయటకి పంపించి వేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నగర కోశాధికారి సి.అశోక్, నవనీత్, మెహబూబ్ భాష, సూరి, శ్రీను ,నరేంద్ర ,షఫీ తదితరులు పాల్గొన్నారు.