రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

TG POLYCET# రేపే తెలంగాణ పాలిసెట్ పరీక్ష

TS POLYCET 2024 Notification TS POLYCET application 2024 TS POLYCET registration details TS POLYCET 2024 syllabus TS POLYCET Hall Ticket Download 2024
Peoples Motivation

TG POLYCET# రేపే తెలంగాణ పాలిసెట్ పరీక్ష

హైదరాబాద్ (పీపుల్స్ మోటివేషన్):-

తెలంగాణ రాష్ట్రంలో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 24న పాలిసెట్ ను 259 కేంద్రాల్లో నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు 92,808 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. గత ఏడాది 1.05 లక్షల మంది పోటీపడ్డారు. ఈసారి పాలిసెట్ నుంచి బాసర ఆర్టీయూకేటీ తప్పుకోవ డంతో అభ్యర్థుల సంఖ్య తగ్గిందని రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి(ఎస్బీటెట్) వర్గాలు తెలిపాయి. 

TS POLYCET 2024 Notification TS POLYCET application 2024 TS POLYCET registration details TS POLYCET 2024 syllabus TS POLYCET Hall Ticket Download 2024

పాలీసెట్‌ 2024 ద్వారా పివి.నరసింహరావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం ద్వారా నిర్వహించే పశుసంవర్థన - మత్స్య పరిశ్రమకు సంబంధించిన కోర్సులు( PVNRTVU), కొండా లక్ష్మణ్‌ తెలంగాణ ఉద్యాన విశ్వ విద్యాలయం (SKLTSHU) అందించే ఉద్యానవన డిప్లొమా కోర్సులు, ప్రొఫెసర్ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ( PJTSAU) ద్వారా అందిస్తున్న వ్యవసాయ కోర్సులలో ప్రవేశాలు కల్పిస్తారు. వీటితో పాటు తెలంగాణ వ్యాప్తంగా పాలిటెక్నిక్ కాలేజీల్లో నిర్వహిస్తున్న కోర్సులు, ప్రభుత్వ, ప్రైవేట్‌ ఎయిడెడ్, అన్‌ ఎయిడెడ్ పాలిటెక్నిక్‌ విద్యా సంస్థలు, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో నిర్వహిస్తున్న పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం పాలీసెట్ 2024 నిర్వహిస్తున్నట్లు నిర్వహకులు ప్రకటించారు
.

Comments

-Advertisement-