AP Assembly: ప్రొటెం స్పీకర్‌ను ఎందుకు ఎన్నుకుంటారు.. స్పీకర్‌కు ఉండే హక్కులు ఉంటాయా..!
ప్రొటెం స్పీకర్ గా ఎవరిని ఎన్నుకుంటారు? అతని యొక్క విధులు ఏంటి?
ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభ తొలి సమావేశాలు ఈనెల 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక కోసం రెండు రోజులపాటు సమావేశం కానుంది. ఏపీ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రొటెం స్పీకర్ అనే పదం ఎక్కువుగా వినిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభ తొలి సమావేశాలు ఈనెల 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక కోసం రెండు రోజులపాటు సమావేశం కానుంది. ఏపీ అసెంబ్లీ (AP Assembly) సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రొటెం స్పీకర్ అనే పదం ఎక్కువుగా వినిపిస్తోంది. ఎమ్మెల్యేలందరితో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. భారత రాజ్యాంగం ప్రకారం దేశంలో రాష్ట్రపతి (President), రాష్ట్రాల్లో గవర్నర్ (Governor) రాజ్యాంగ పరిరక్షకులుగా వ్యవహరిస్తారు. ఎంపీలతో రాష్ట్రపతి లేదా వారిచే నియమితులైన ప్రతినిధి, ఎమ్మెల్యేలతో గవర్నర్ లేదా వారితో నియమితులైన ప్రతినిధి ప్రమాణ స్వీకారం చేయించాలని నిబంధనలు చెబుతున్నాయి. దీంతో ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించేందుకు గవర్నర్ ఎమ్మెల్యేల్లో ఒకరిని తన ప్రతినిధిగా నియమిస్తారు. కొత్త శాసనసభకు స్పీకర్ ఎన్నిక జరిగేవరకు గవర్నర్ నియమించిన వ్యక్తి ఆ బాధ్యతలను తాత్కాలికంగా నిర్వర్తిస్తారు. రాజ్యాంగబద్ధంగా స్పీ్కర్‌కు ఉండే అన్ని అధికారాలు ప్రొటెం స్పీకర్‌కు ఉండవు. పరిమితులకు లోబడి మాత్రమే తన విధులను నిర్వహించాల్సి ఉంటుంది.