AP EAMCET RESULTS: ఈఏపీసెట్ ఫలితాలు..
AP EAMCET RESULTS: ఈఏపీసెట్ ఫలితాలు..
ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీ సెట్ ఫలితాల విడుదలలో ఉన్నత విద్యామండలి తీవ్ర జాప్యం చేస్తోంది. దీంతో దాదాపు 3.30 లక్షల మంది విద్యార్థులకు నిరీక్షణ తప్పడం లేదు.ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పదవికి హేమచంద్రారెడ్డి రాజీనామా చేశారు. ఉన్నత విద్యాశాఖ ఈ రాజీనామాపై అభ్యంతరం చెప్పడంతో ఆయన మెడికల్ లీవ్ పెట్టారు. ఇన్ఛార్జి చైర్మన్ బాధ్యతలను వైస్ చైర్మన్ రామమోహన్రావుకు అప్పగించారు. ఈఏపీ సెట్ ఫలితాలు విడుదలలో కావాలనే జాప్యం చేస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో ఇప్పటికే ఈఏపీసెట్ ఫలితాలు విడుదల చేసి, కౌన్సెలింగ్ కు సిద్ధమవుతున్నారు. ఇక్కడ ప్రవేశపరీక్ష పూర్తయి, ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణ కూడా పూర్తి చేశారు. మరోవైపు ఏపీలో ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల చేయాలని విద్యార్థుల నుంచి డిమాండ్ పెరుగుతున్నా ఎలాంటి నిర్ణయం ప్రకటించడం లేదు. చైర్మన్ లేనందున ఫలితాల విడుదలపై ఇన్ఛార్జి ఛైర్మన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే..
ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి