AP GOVT: ఏపీలో భారీ గా కలెక్టర్లు బదిలీ... ఉత్తర్వులు జారీ
AP GOVT: ఏపీలో భారీ గా కలెక్టర్లు బదిలీ... ఉత్తర్వులు జారీ
రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
అమరావతి, జూన్ 22 (పీపుల్స్ మోటివేషన్):-
రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
• గుంటూరు జిల్లా కలెక్టర్ గా ఎస్.నాగలక్ష్మి
• ప్రస్తుతం గుంటూరు కలెక్టర్ గా ఉన్న వేణుగోపాల్ రెడ్డి జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశం
• విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున జీఏడీకి రిపోర్టు చేయాలని ఉత్తర్వులు
• విశాఖ జేసీకి కలెక్టర్ గా అదనపు బాధ్యతలు
• ఏలూరు జిల్లా కలెక్టర్ గా కె.వెట్రిసెల్వ నియామకం
• అల్లూరి జిల్లా కలెక్టర్ ఎం. విజయసునీత బదిలీ
• అల్లూరి కలెక్టర్ గా దినేష్ కుమార్ యామకం
• తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గా పి.ప్రశాంతి
• విజయనగరం జిల్లా కలెక్టర్ గా బి.ఆర్.అంబేడ్కర్
• పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ గా సి. నాగరాణి
• చిత్తూరు జిల్లా కలెక్టర్ గా సుమిత్ కుమార్
• కాకినాడ జిల్లా కలెక్టర్ గా సగలి షణ్మోహన్
• ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గా జి.సృజన
• ప్రకాశం జిల్లా కలెక్టర్ గా తమీమ్ అన్సారియా
• కర్నూలు జిల్లా కలెక్టర్ గా రంజిత్ బాషా
• బాపట్ల కలెక్టర్ గా ఆ జిల్లా జేసీకి పూర్తి అదనపు బాధ్యతలు
సీనియర్లు రాక...
సీనియర్ ఐఏఎస్ అధికారి పీయూష్ కుమార్ ఏపీకి తిరిగి వచ్చారు. పీయూష్ కుమార్ను కేంద్ర సర్వీసుల నుంచి రీలివ్ చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రంలో పని చేస్తున్న ఏపీ కేడర్ అధికారులను రాష్ట్రానికి పంపాలని ఇటీవలే డీవోపీటీకి చంద్రబాబు లేఖ రాశారు. ప్రస్తుతం కేంద్రంలో కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ శాఖ అదనపు సెక్రటరీగా పీయూష్ కుమార్ విధులను నిర్వహిస్తున్నారు. ఏపీలో ఫైనాన్స్ శాఖ బాధ్యతలను పీయూష్క అప్పగించే అవకాశం ఉంది. కేంద్రంలో మంచి పరిచయాలు ఉండడంతో పీయూష్ను ప్రభుత్వం ఏపీకి రప్పించుకుంది. త్వరలో కేంద్రంలో పని చేస్తున్న ఇంకొందరు సీనియర్ ఐఏఎస్లు ఏపీకి తిరిగి వచ్చే అవకాశం ఉంది.