AP Mega DSC: ఏపీలో 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ.. నోటిఫికేషన్ జారీ
AP Mega DSC: ఏపీలో 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ.. నోటిఫికేషన్ జారీ
ఏపీలో మెగా డీఎస్సీకి సీఎం చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సచివాలయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం టీచర్ పోస్టుల భర్తీ ఫైల్‌పై తొలి సంతకం చేశారు. 16,347 పోస్టుల భర్తీకి అనుమతినిచ్చారు.
అమరావతి, జూన్ 13 (పీపుల్స్ మోటివేషన్):-
ఏపీలో మెగా డీఎస్సీకి సీఎం చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సచివాలయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం టీచర్ పోస్టుల భర్తీ ఫైల్‌పై తొలి సంతకం చేశారు. 16,347 పోస్టుల భర్తీకి అనుమతినిచ్చారు. ఈ నేపథ్యంలో 6100 పోస్టుల భర్తీకి గతంలో వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ను సవరిస్తూ కొత్త నోటిఫికేషన్ జారీ చేశారు.
ఈ ఏడాది మొదట్లో వైసీపీ ప్రభుత్వం 6,100 టీచర్ పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 2280 ఎస్టీటీ, 2299 స్కూల్ అసిస్టెంట్ 1264 టీజీటీ, 215 పీజీటీ, 42 ప్రిన్సిపల్ పోస్టులు ఉన్నాయి. అయితే గతంలో ఇచ్చిన ఈ నోటిఫికేషన్‌ను కొత్తగా ఏర్పాటైన కూటమి ప్రభుత్వం సవరించింది. ఎన్నికల హామీల మేరకు 16,347 పోస్టులతో మెగా డీఎస్సీని విడుదల చేసింది. ఇందులో ఎస్టీటీ 6,371; పీఈటీ 132; స్కూల్ అసిస్టెంట్ 7,725; టీజీటీ 1,781; పీజీటీ 286; ప్రిన్సిపల్ 52 పోస్టులు ఉన్నాయి.