-Advertisement-

AP: ఏపీలో రెండు ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల..పోలింగ్ ఎప్పుడంటే?

Daily telugu Daily trending news Breaking news telugu Telugu news Telugu stories Crime News Politics news Current Affairs pdf Today Latest headlines
Pavani

AP: ఏపీలో ఆ ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల..?

సీ. రామచంద్రయ్యపై అనర్హత వేటు..

షేక్‌ మహ్మద్‌ ఇక్బాల్‌ రాజీనామా నేపథ్యంలో సీట్లు ఖాళీ..

ఈ నెల 25 నోటిఫికేషన్ విడుదల..

జూలై 2 తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ..

జులై 12 తేదీన పోలింగ్..

Daily telugu Daily trending news Breaking news telugu Telugu news Telugu stories Crime News Politics news Current Affairs pdf Today Latest headlines
ఎమ్మెల్యే కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నిక షెడ్యూలు విడుదలైంది. ఈ నెల 25 నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. నామినేషన్ల దాఖలుకు జూలై 2 తేదీ తుది గడువుని పేర్కొంది. నామినేషన్ల ఉపసంహరణకు జూలై 5 తేదీ వరకు తుది గడువిచ్చింది. జులై 12 తేదీన ఎన్నికలు జరుగుతాయని నోటిఫికేషన్లో పేర్కొన్న పేర్కొంది ఈసీ. సీ. రామచంద్రయ్యపై అనర్హత వేటు, షేక్‌ మహ్మద్‌ ఇక్బాల్‌ రాజీనామా నేపథ్యంలో ఈ రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి. 2021లో వైసీపీ టికెట్‌పై ఎమ్మెల్సీగా గెలిచి, ఈ ఏడాది మార్చిలో తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించినందుకుగాను ఆయనపై అనర్హత వేటు పడింది. వైసీపీ నుంచి గెలిచిన ఇక్బాల్‌.. ఆ పార్టీకి రాజీనామా చేసి, ఏప్రిల్‌లో టీడీపీలో చేరారు. అనంతరం ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ ఇద్దరి పదవీకాలం 2027 మార్చి 29 వరకు ఉంది.ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికకు సంబంధించి 12న పోలింగ్‌ జరగనుంది. అదే రోజు ఫలితాలు ప్రకటించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకనటలో పేర్కొంది. ఏపీ అసెంబ్లీలో ఎన్డీయే కూటమికి 164 మంది సభ్యుల మద్దతు ఉన్న నేపథ్యంలో రెండు సీట్లూ కూటమికే దక్కుతాయని పలువురి అభిప్రాయం. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో 175 సీట్లకు గాను టీడీపీ 135, దాని మిత్రపక్షాలు జనసేన 21, బీజేపీ 8 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. వైసీపీ 11 స్థానాలకు పరిమితమైంది. వైసీపీ రెబల్‌ ఎమ్మెల్సీ వంశీ కృష్ణ యాదవ్‌పైనా అనర్హత వేటు పడింది. ఆయన స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆ స్థానానికి త్వరలో పోలింగ్‌ తేదీని ప్రకటించనున్నారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చవి చూసిన వైసీపీ తరువాత వచ్చే ఉప ఎన్ని్కల్లో ఎలాగైనా గెలవాలని కసరత్తు చేస్తోంది.

Comments

-Advertisement-