ఎమ్మెల్యే, ఎంపీ గా రెండు సభల్లో కొనసాగితే తప్పేంటి..ఆర్ఎల్పీ నేత హనుమాన్ బినివాల్ వాఖ్య
Telugu news Daily news Trending news Latest Telugu news Interesting facts news Breaking Telugu news govt jobs ssc jobs current affairs daily Telugu...
By
Priya
ఎమ్మెల్యే, ఎంపీ గా రెండు సభల్లో కొనసాగితే తప్పేంటి..ఆర్ఎల్పీ నేత హనుమాన్ బినివాల్ వాఖ్య
ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఎంపీగా ఎన్నికై రెండు సభల్లోనూ కొనసాగితే తప్పేంటని ఆర్ఎల్పీ నేత హనుమాన్ బినివాల్ అభిప్రాయం వ్యక్తం చేశారు.జైపుర్: ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి లోక్సభకు ఎంపీగా ఎన్నికైతే.. రెండు సభల్లోనూ కొనసాగేలా నిబంధన ఉండాలని రాష్ట్రీయ లోక్గాంత్రిక్ పార్టీ(ఆర్ఎల్పీ) నేత హనుమాన్ బినివాల్ (Hanuman Beniwal) అభిప్రాయపడ్డారు. రాజస్థాన్లోని నాగౌర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందిన ఆయన కొత్త వాదనను తెర పైకి తీసుకువచ్చారు. అమెరికాలో ఇటువంటి నిబంధన ఉందని.. భారత్లోనూ ఇలా ఉంటే బాగుంటుందన్నారు.
భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 101(2) ప్రకారం.. విధానసభ సభ్యుడిగా.. ఎంపీగా ఒకేసారి సమయంలో ఉభయ సభల్లో సభ్యుడిగా కొనసాగడానికి వీలు లేదు. అయితే.. అమెరికాలో ఇందుకు వీలుందని.. భారత్లో ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు. "రెండు పదవులు ఉండటం వల్ల కలిగే ఇబ్బందులేంటి? ప్రజలే మమ్మల్ని ఎన్నుకున్నారు. ఎమ్యెల్యే.
పదవికి రాజీనామా చేసిన తర్వాత జరిగే ఉప ఎన్నికలోనూ ఆర్ఎల్పీ పోటీ చేస్తుంది" అని బినివాల్ పేర్కొన్నారు.
త్వరలో జరగనున్న ఉప ఎన్నికలో కాంగ్రెస్తో పొత్తుపై పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. అయితే.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా పోరాడుతామను పాత పద్ధతిని పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అందుకోసం ఉద్యమాన్ని ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
Comments