తూకంలో కోతలు.. అదనపు వసూళ్లు
తూకంలో కోతలు.. అదనపు వసూళ్లు
నాణ్యత ప్రమాణాలు గాలికి ... పట్టింపులు లేని అధికారులు కానరాని పర్యవేక్షణ.... జిల్లా కేంద్రమైన మండల కేంద్రమైన....మోసాలకు నెలవు
పెద్దపల్లి : అది జిల్లా కేంద్రమైన, మండల కేంద్రమైన పర్వాలేదు... ఇచ్చేవాడు ఎవరైనా మనకు కావాల్సింది డబ్బులు... జనాలు ఎలా పోయినా మాకేంటి.... జీతం డబ్బుల కంటే పెద్ద మొత్తంలో వచ్చే పైసలను ఎవరు వదులు కుంటారు... అనుకుంటున్నారేమో ఆయా శాఖల అధికారులు, ప్రజలకు నాణ్యతతో పాటు మోసం లేకుండా సేవలు అందించాల్సిన అధికారులు దుప్పటి వేసుకొని పడుకుంటున్నారు. హోటళ్ళు, కిరాణ షాపులు, చికెన్ సెంటర్ ఇలా చెప్పుకుంటూ పోతే మోసం చేయడానికి, వినియోగదారులను 'దోచుకొని జేబులు గుల్ల చేయాడానికి నిత్యం సదరు వ్యాపారస్తులు ఎదురు చూస్తూనే వున్నారు. ప్రజలకు ఏది నాణ్యమైనదో, తెలియక పోగా షాపుల వద్ద గ్రేడ్ ల వారిగా బోర్డులు పెట్టాల్సి ఉన్నా ఏ ఒక్క షాపు ముందు కనిపించడం లేదు. మరి అధికారులు ఈ విషయాలు ఎందుకు పట్టించుకోవడం లేదు. వినియోగదారులకు సరైన అవగాహన ఎందుకు కల్పించడం లేదు. పెట్రోల్ పంపుల్లో కల్తీ, పప్పు దినుసుల్లో కల్తీలు, చివరకు నిత్యావసరం వస్తువుల్లో కల్తీ జరుగుతున్నా సదరు శాఖ అధికారులు ఎందుకు స్పందించడం లేదు. వినియోగదారులు పిర్యాదు చేస్తే కానీ స్పందించనంత పని
వారికేముందో ఆ దేవునికే తెలియాలి. వారు చేయాల్సిన పని నాణ్యమైన వస్తువులు వినియోగదారులకు అందేలా చూడాలి. కానీ వీరు చేస్తున్నదేమిటి. వినియోగదారులకు కాకుండా వ్యాపారులకు వంతపాడటమే వీరి డ్యూటీనా, జిల్లాలోనే ఇలా ఉంటే మండల, గ్రామస్థాయిల్లో అధికారుల పనితీరు ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. మనం కొనుగోలు చేసే ప్రతి వస్తువును ఎంఆర్ పీ రేటుకు తీసుకొని, బిల్లు ఇవ్వాల్సి ఉన్నా ఎక్కడా కూడా ఇది జరగడం లేదు. దీని వల్ల ప్రభుత్వ ఆదాయనికి పెద్ద మొత్తంలో గండి పడుతుందనే చెప్పాలి. ఇటు ప్రజలకు అటు ప్రభుత్వానికి సేవ వేయాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తడం లోని అంతర్యం ఏమిటో సదరు అధికారులు చెప్పాలి. జిల్లా కేంద్రానికి, మండల కేంద్రాలకు అనుకొని ఉన్న ఊర్లలో మొదలుకొని, ప్రతి గ్రామ పంచాయతీ లలో ప్రతి కిరాణా షాపుల్లో ప్రతి వస్తువు మీద ఎం ఆర్ పీఠంటే ఎక్కువ మొత్తంలో తీసుకుంటున్నారు. శీతల పానీయాల మీద కూలింగ్ చార్జీల పేరుతో అధిక మొత్తం వసూలు చేస్తున్నారు. అలాగే గత సంవత్సరం కాలం నుండి జిల్లా కేంద్రంలోని చికెన్ సెంటర్ నిర్వాహకులు సిండికేట్ గా మారి, దోచుకుంటున్నా పట్టించు కోకవడం, దీనికి తోడుగా తూకం వేయడంలో హస్త వాసి ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు మెండుగా వినిపిస్తున్నాయి. ఇలా నిత్యం ప్రజలను ఏదో ఒక చోట దోపిడీ చేయడంతోపాటు నాణ్యమైన వాటిని అందించడంలో కూడా మోసాలలకు తెగబడు తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా అధికారులు క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహించడంతో పాటు వినియోగదారులను చైతన్యం చేసే కార్యక్రమాలు, వారికి న్యాయమైన సేవలు అందించాలని పలు వర్గాల ప్రజలు కోరుతున్నారు.