-Advertisement-

Health tips:గసగసాలు రోజూ తీసుకుంటే మహిళలకు ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

Health news health tips Telugu health benefits in Telugu health losses in Telugu Health and fitness Lifestyle newsPoppy seeds side effects Poppy seeds
Pavani

గసగసాలు రోజూ తీసుకుంటే మహిళలకు ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

మన వంట గదిలో ఉండే పోపుల డబ్బాలో గసగసాలు వంటలకు రుచిని పెంచడం మాత్రమే కాదు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.. ఎన్నో రకాల సమస్యలు తొలగిపోతాయి.. గసగసాల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆడవారు వీటిని తీసుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. అవేంటో ఒకసారి తెలుసుకుందాం.

Health news health tips Telugu health benefits in Telugu health losses in Telugu Health and fitness Lifestyle newsPoppy seeds side effects Poppy seeds

వీటిలో అధిక శాతం కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.. ఆడవారికి ఈ పోషకాలు చాలా మంచివి.. అలాగే వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది.. వీటిని తీసుకోవడం వల్ల ఎక్కువగా ఆకలి వెయ్యదు.. దాంతో తినాలని అనిపించదు.. అలా సులువుగా బరువు తగ్గుతారు..జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగ్గా ఉంటుంది. దీంతో మలబద్ధకం వంటి సమస్యలు దూరమవుతాయి. ఈ గసగసాల్లో కొన్ని ప్రత్యేక సమ్మేళనాలు ఉంటాయి.. ఒత్తిడి దూరం అవుతుంది. రోజంతా హాయిగా రికాక్స్ గా ఉంటారు.. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇందులోని హెల్దీ ఫ్యాట్స్ ఉన్నాయి. ఇవి చర్మ, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి.. పీరియడ్స్‌లో వచ్చే నొప్పి, ఇబ్బందులు దూరమవుతాయి. అంతేకాకుండా తిమ్మిరి వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.. ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని ఎక్కువగా తింటే మొదటికే మోసం వస్తుంది.. అందుకే లిమిట్ గానే తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు..

Comments

-Advertisement-