బంగారుపేటలో నాటు సారా స్ధావరాల పై విస్తృతంగా దాడులు….
బంగారుపేటలో నాటు సారా స్ధావరాల పై విస్తృతంగా దాడులు..
కార్డన్ సెర్చ్ ఆపరేషన్ లో భారీగా పట్టుబడిన నాటుసారా..
జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్ ఐపియస్
కర్నూలు, జూన్ 22 (పీపుల్స్ మోటివేషన్):-
జిల్లాలో ఎక్కడైనా నాటు సారా, మద్యం అక్రమ రవాణా జరుగుతుంటే ప్రజలు డయల్ 100 గాని, స్ధానిక పోలీసులకు సమాచారం తెలియజేయాలి.
శనివారం ఉదయం జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్ ఐపియస్ ఆదేశాల మేరకు కర్నూలు సబ్ డివిజన్ డిఎస్పీ కె. విజయ శేఖర్ ఆధ్వర్యంలో కర్నూలు రెండవ పట్టణ పోలీసులు , సెబ్ పోలీసులు కలిసి కర్నూలు బంగారు పేటలో నాటు స్దావరాల పై దాడులు నిర్వహించారు. ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ దాడుల్లో 2 వేల 400 వందల లీటర్ల నాటు సారా ఊట బెల్లం ను ధ్వంసం చేశారు. 150 లీటర్ల నాటు సారా , 100 కేజీల నల్లబెల్లం ను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడులలో కర్నూలు డిఎస్పీ తో పాటు కర్నూలు టు టౌన్ సిఐ ఇంథియాజ్ భాషా , కర్నూలు ఒకటవ పట్టణ సిఐ పవన్ కుమార్, కర్నూలు నాల్గవ పట్టణ సిఐ శంకరయ్య, కర్నూలు సెబ్ సిఐ నరసనాయుడు, మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్. విశ్వేశ్వర రెడ్డి, టు టౌన్ ఎస్సై శ్రీధర్ బాబు , సెబ్ ఎస్సై రెహనా బేగం, మున్సిపల్ శానిటరీ సూపర్ వైజర్ నాగరాజు, శానిటరీ ఇన్స్ పెక్టర్లు మృతుజావళి, మునిస్వామి మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.