కాఫీని ఎక్కువగా తాగుతున్నారా? అయితే ఇది తప్పక చదవండి..?
కాఫీని ఎక్కువగా తాగుతున్నారా? అయితే ఇది తప్పక చదవండి..?
పొద్దున్నే లేవగానే చాలామందికి టీ, కాఫీ తాగే అలవాటు ఉంటుంది.. బరువు తగ్గాలని అనుకొనేవారు కాఫీని తాగొచ్చునా? లేదా? అనే సందేహం అందరికీ వస్తుంది.. అయితే నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
చాలామంది కాఫీని ఎక్కువగా తాగుతారు.. ఒక సమయం సందర్బం లేకుండా తాగుతారు. బద్దకంగా ఉండి నిద్ర వస్తుందని అనుకున్నప్పుడు ఒక కప్పు కాఫీ త్రాగి, హమ్మయ్య నిద్ర ఎగిరిపోయిందని సంతోషపడతాము.. కాఫీని తాగడం వల్ల లాభాలతో పాటుగా, నష్టాలు కూడా ఉన్నాయి.. లిమిట్ గా తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.. అదే ఎక్కువగా తాగితే నష్టాలు తప్పవని నిపుణులు చెబుతున్నారు..
రక్తంలో కొలస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది కాఫీ ని త్రాగుతున్నారు. దీనిలో ఉండే కెఫిన్ అనే పదార్దం కేంద్ర నాడి మండల వ్యవస్థలో ఉత్తేజాన్ని కలిగిస్తుంది.. ఫిల్టర్ చేసిన కాఫీ త్రాగితే కొంత వరకు ఈ ప్రమాదం నుండి తప్పించుకోవచ్చు. గర్భవతులు రోజులో తక్కువగా కాఫీ త్రాగాలి.. ఎందుకంటే ఆరోగ్యానికి మంచిది కాదు.. రక్త స్రావం అయ్యే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు..కాఫీ త్రాగే అలవాటు ఉన్నవారు ఒక్కసారిగా మానకుండా క్రమేపి తగ్గించుకోవాలి. రోజుకి ఒక కప్పు కాఫీ త్రాగితే శారీరకంగా, మానసికంగా బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు… సమ్మర్ లో కాఫీలో తాగడం మంచిది కాదని గుర్తుంచుకోండి..