చినుకు జాడేది...!
చినుకు జాడేది...!
మబ్బులే తప్ప వర్షం పడని వైనం. జూన్ లోనూ తప్పని ఒక్క ఫోత ఎంతకి తగ్గని పగటి ఉష్ణోగ్రతలు.
గోదావరిఖని: వాసకాలం వచ్చినా మబ్బులే తప్ప చినుకు జాడలేదు. ప్రస్తుతం పెద్దపెల్లి జిల్లాలో విభిన్న వాతావరణం నెలకొంది. అటు వ్యవసాయానికి అవసరమైన వర్షాలు కురుపకపోవడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు.
అసలైన తొలకరి పలకరింపు కోసం రైతులు అశగా ఎదురుచూస్తున్నారు. గతేడాది జూన్ లో ఒక మోస్తారుగా వర్షాలు పడ్డాయి. ఆరంభంలోనే వరుణుడు కొంత కరుణించడంతో రైతులు ఉత్సాహంగా ఖరీఫ్ సాగు పనులు చేపట్టారు. కానీ... ఈ ఏడాది వరుణుడి జాడ కనిపించడం లేదు. జూన్ మూ? శివ కార్తి సగం కోటి కాలం గడిచిన నైరుతి రుతుపవనాల ప్రభావం ఎక్కడ కాన రావడం లేదు. వర్షాలతో చల్లబడాల్సిన వాతావరణం భానుడి భగ భగాలతో మండిపోతుంది. ఏప్రిల్, మే నెలల్లో సూర్య ప్రతాపంతో అల్లాడిన ప్రజలు... జూన్, లో వర్షాలతో కొంత సేద తేరచ్చని, ఆశించారు. కానీ అది నిరాశ అవుతుంది. దట్టమైన మబ్బులు పడుతున్నా. గాలి దుమారంతో కూడిన చిరుజల్లులే పడుతున్నాయి తప్ప ఇప్పటివరకు భారీ వర్షం నమోదైన దాఖలు లేవు. అయితే రోజురోజుకు ఉష్ణోగ్రతలు మళ్లీ పెరుగుతున్నాయి. మండే ఎండలకు ఊకపోత తోడవడంతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు పెరగడమే కాక రాత్రిపూట కూడా వాతావరణం వేడి గానే ఉంటుంది. జూన్ తొలి వారంలోనేవర్షాలు ప్రారంభమై, రెండో వారం నాటికి వాతావరణం పూర్తిగా చల్లబడాలి. కానీ ఇప్పటికీ సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తూనే ఉన్నాడు. జిల్లాలో మంగళవారం సుమారు 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అటు గాలిలో తేమ 70% ఉండడంతో ప్రజలు ఊకపోతుతో అల్లాడిపోతున్నారు. మరో వారం రోజుల పాటు ఇవే ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని వాతావరణం శాఖ హెచ్చరించడంతో ఆందోళన చెంచుతున్నారు. మృగశిర కార్తెకు ముందు రెండు రోజులు మాత్రమే, ఉరుములు, మెరుపుతో కొంత ఆశలు రేకెత్తించాయి. అయితే ఆరితలోనే గాలులు వేయడంతో మేఘాలు తేలిపోయాయి. ఆ తర్వాత రోజు ఇదే పరిస్థితులు నెలకొంటున్నాయి. విత్తుకునేందు కొనేందుకు. మరి కొంత సమయం ఉన్నప్పటికీ సీజన్ ప్రారంభంలోనే కాలం కలిసి రాకపోవడంతో కర్షకులు ఆందోళన చెందుతున్నారు.