వేప రసం తాగడంవల్ల ఎన్ని లాభాలో!!
వేప రసం తాగడంవల్ల ఎన్ని లాభాలో!!
ఆరోగ్య ప్రధాయినిగా వేప చెట్టును పరిగణిస్తూ ఉంటారు. ఎందుకంటే వేపాకులు, బెరడు, వేప పువ్వు, వేప నూనె ఇలా వేప చెట్టుకు సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా వివిధ రోగాలకు మెడిసిన్ గా పనిచేస్తూ ఉంటుంది. అలాగే చాలామంది ఆయుర్వేదంలో కూడా వీటిని మెడిసిన్ తయారీలో ఉపయోగిస్తూ ఉంటారు. అయితే చర్మవ్యాధులు అజీర్తి, జుట్టు సమస్యలు, దంత సమస్యలు ఇలా ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు వేపచెట్టు చాలా ప్రధాన ఆధారం. అయితే ప్రతిరోజు వేపరసం తాగడం వలన ఎన్నో రోగాలు పరారవుతాయని నిపుణులు చెబుతున్నారు.
ఎందుకంటే వేప ఆకులలో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. కాబట్టి ప్రతి రోజు ఉదయాన్నే లేచి కాళీ కడుపుతో వేపరసాన్ని తాగడం వలన కడుపులోని మలినాలు అన్ని తొలగిపోతాయి. ఇంకా మలబద్ధకం సమస్య కూడా తగ్గిపోతుంది. ఇక పేగులకు ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా వాటిని వేప నివారిస్తుంది. అంతేకాకుండా ఆ వివిధ రకాల క్యాన్సర్ రోగాల బారిన పడకుండా కూడా చూస్తుంది. అయితే ఇది గ్యాస్, ఉబ్బరం లాంటి సమస్యలను కూడా తగ్గించి జీర్ణశక్తిని కూడా మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా ఇది రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఇక శరీరంలోని టాక్సిన్ లను బయటకు పంపించడంలో కూడా చాలా సహాయపడుతుంది. ఇక నోటి ఆరోగ్యాన్ని కూడా ఇది కాపాడుతుంది. అయితే నోటి దుర్వాసన, నోటి పుండ్లు లాంటి సమస్యలను దూరం చేయడానికి వేప పుల్లతో పళ్ళు తోమడం చాలా మంచిది. ఎందుకంటే ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి చర్మం కు కూడా చాలా ఉపయోగపడతాయి. చర్మంపై ఏర్పడే దద్దుర్లు, మొటిమలు లాంటివి ఇవి తగ్గిస్తుంది. ఇక అన్నింటికంటే ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులకు వేప రసం చాలా మేలు చేస్తుంది. షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారు షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేయడానికి ఖాళీ కడుపుతో ఉదయాన్నే వెపరసం తాగడం చాలా మంచిది. ఇది షుగర్ లెవెల్స్ ను నియంత్రిస్తాయి.