-Advertisement-

Chandrayan 4: 14 రోజుల పాటు చంద్రుని పై పరిశోధనలు చేయనున్న చంద్రయాన్ 4

Chandrayaan-4 launch date chandrayaan-3 launch date Chandrayaan 5 chandrayaan-4 launch date and time Chandrayaan-4 name Chandrayaan 4 importances news
Priya

Chandrayan 4: 14 రోజుల పాటు చంద్రుని పై పరిశోధనలు చేయనున్న చంద్రయాన్ 4

చంద్రయాన్-3 ప్రయోగంలో జాబిల్లి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ను దించిన ఇస్రో కీలక విషయాలను రాబట్టింది. ఆ సమాచారంతో తర్వాత చంద్రయాన్ 4 ను ప్రయోగించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే చంద్రుడి ఉపరితలం పై నుంచి రాళ్లు, మట్టిని భూమిపైకి తీసుకువచ్చి వాటి ద్వారా మరిన్ని విషయాలు రాబట్టాలని ప్రయత్నిస్తోంది. ఇందుకోసం చంద్రయాన్ 4 ను ప్రయోగించనుంది.

Chandrayaan-4 launch date chandrayaan-3 launch date Chandrayaan 5 chandrayaan-4 launch date and time Chandrayaan-4 name Chandrayaan 4 importances news


ఈ క్రమంలోనే చంద్రయాన్ 4కు సంబంధించి అనేక విషయాలను ఇప్పటికే ఇస్రో వెల్లడించింది. తాజాగా చంద్రుడిపై చంద్రయాన్ 4 ఎన్ని రోజులు ఉంటుందో తెలిపింది.

ఈ 14 రోజుల పాటు(ఒక లూనార్ డే అంటే భూమిపై 14 రోజులకు సమానం) చంద్రుడిపై చంద్రయాన్ 4 పరిశోధనలు చేసి.. తిరిగి 14 రోజుల తర్వాత భూమికి చేరుకుంటుందని ఇస్రో అధికారులు వెల్లడించారు. చంద్రుడిపై 14 రోజులు పగలు, 14 రోజులు రాత్రి ఉంటుంది. పగలు సమయంలో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. దాదాపు 127 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుందని అంచనా. ఇక రాత్రి సమయంలో 14 రోజులపాటు గడ్డకట్టుకుపోయే చలి. ఉంటుందని తెలుస్తోంది.

అందుకే పగలు సమయంలోనే చంద్రయాన్ 4 ను అక్కడ ల్యాండ్ చేయనున్నారు. చంద్రయాన్ 3 కూడా జాబిల్లిపై పగలు సమయంలోనే దిగి.. 14 రోజుల పాటు పరిశోధనలు జరిపి.. రాత్రి వేళ స్లీవ్మోడ్ లోకి వెళ్లింది. అయితే అక్కడి వాతావరణ పరిస్థితులను తట్టుకోలేని చంద్రయాన్ 3 మళ్లీ మేల్కోలేదు. ఈ క్రమంలోనే చంద్రయాన్ 3 తో నేర్చుకున్న విషయాల ఆధారంగా చంద్రయాన్ 4ను అభివృద్ధి చేస్తున్నారు. చంద్రయాన్ 4 ప్రయోగాన్ని 2040 చేపట్టాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఇస్రో ఇప్పటికే చెప్పింది.

చంద్రుడిపైన ఉన్న రాళ్లు, మట్టి నమూనాలను సేకరించి. వాటిని మరింత విశ్లేషించేందుకు భూమిపైకి తీసుకురావడమే చంద్రయాన్ 4 యొక్క ప్రాథమిక లక్షం. ఒకవేళ చంద్రయాన్ 4 విజయవంతం అయి తిరిగి భూమిపైకి వస్తే అమెరికా, రష్యా, చైనా తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ అవతరించనుంది. ఇక చంద్రుడిపై చంద్రయాన్ 3 ల్యాండ్ అయిన శివశక్తి పాయింట్కు దగ్గరలోనే చంద్రయాన్ 4 కూడా ల్యాండ్ అవ్వనుంది.

Comments

-Advertisement-