Cooking Oil: ఒకసారి వాడిన నూనె మళ్లీ వాడుతున్నారా అయితే.. అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లే..!
Cooking Oil: ఒకసారి వాడిన నూనె మళ్లీ వాడుతున్నారా అయితే.. అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లే..!
- ఒకసారి వాడిన నూనెను మళ్లీ వాడటం చాలా ప్రమాదకరం..
- ప్రాణాలకే ముప్పు వచ్చే అవకాశం ఉందంటున్న ఆరోగ్య నిపుణులు..
- గుండె సంబంధిత సమస్యలు..
- క్యాన్సర్ వచ్చే అవకాశం..
పండుగ వచ్చిదంటే చాలు రకరకాల తినుబండరాలు, వంటకాలు చేస్తారు. అందుకోసం ఎక్కువగా నూనెను వాడుతారు. అయితే.. వంటలు చేసేందుకు పాన్లలో అధికంగా నూనెను పోస్తుంటారు. అన్నీ వంటకాలు చేయగా మిగిలిన నూనెను మళ్లీ వేరే వంటకాల కోసం దాచిపెడతారు.
అలా వాడిన నూనెను మళ్లీ మళ్లీ వినియోగిస్తుంటారు. అయితే.. ఒకసారి వాడిన నూనెను మళ్లీ వాడటం చాలా ప్రమాదకరం.. దాని పర్యావసానల వల్ల ప్రాణాలకే ముప్పు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే.. వాడిన నూనెను మళ్లీ మళ్లీ వాడటం వల్ల కలిగే నష్టాలేంటో తెలుసుకుందాం.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ఇటీవల విడుదల చేసిన మార్గదర్శకాలలో కూరగాయల నూనె లేదా ఏదైనా రకమైన నూనెను మళ్లీ మళ్లీ వాడటం పట్ల జాగ్రత్త వహించాలని సూచించింది. ఒకసారి వాడిన నూనెను మళ్లీ వాడటం వల్ల గుండె సంబంధిత సమస్యలు, క్యాన్సర్ వంటి ప్రాణంతక వ్యాధుల ప్రమాదాన్ని పెంచే విషపూరిత సమ్మేళనాలు ఉత్పత్తి అవుతాయని వైద్య పరిశోధనా సంస్థ తెలిపింది.
అంతేకాకుండా.. వంట నూనెను మళ్లీ వేడి చేయడం వల్ల టాక్సిన్స్ విడుదల అవుతాయని, శరీరంలో ఫ్రీ రాడికల్స్ పెరుగుతాయని.. ఇది వాపు, వివిధ దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీస్తుందని తెలిపింది. మీకు తరచుగా గ్యాస్ వస్తే లేదా కడుపులో మంటగా అనిపిస్తే.. దీనికి కారణం తరుచుగా వేడి చేసిన వంట నూనె అని చెప్పాలి. స్ట్రీట్ ఫుడ్, రెస్టారెంట్లలో ఒకసారి ఉపయోగించిన వంట నూనెనే మళ్లీ మళ్లీ ఉపయోగిస్తుంటారు. ఈ క్రమంలో.. ప్రజలు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. మరోవైపు.. అధిక బీపీకి కారణమవుతుంది. అందుకే హై బీపీ ఉన్నవాళ్లు పదే పదే వేడిచేసిన నూనెను వాడకూడదు.