Cricket T20 World Cup: 20 వరల్డ్ కప్ ప్రైజ్ మనీ ఎంతో తెలుసా..?
Cricket T20 World Cup: 20 వరల్డ్ కప్ ప్రైజ్ మనీ ఎంతో తెలుసా..?
ఈరోజు భారత్-దక్షిణాఫ్రికా మధ్య ఫైనల్ మ్యాచ్
బార్బడోస్లోని కెన్సింగ్టన్ ఓవల్లో రాత్రి 8 గంటలకు మ్యాచ్
2024 టీ20 ప్రపంచకప్ ప్రైజ్ మనీ ఎంతో తెలుసా..?
ఫైనల్లో విజేతగా నిలిచిన జట్టుకు రూ. 20.42 కోట్లు.
టీ20 వరల్డ్ కప్ 2024 టైటిల్ మ్యాచ్.. ఈరోజు భారత్- దక్షిణాఫ్రికా మధ్య జరగనుంది. బార్బడోస్లోని కెన్సింగ్టన్ ఓవల్లో ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. అయితే.. ఇరుజట్లు ట్రోఫీని సొంతం చేసుకోవాలనే కసితో ఉన్నాయి. 11 సంవత్సరాల తర్వాత ట్రోఫీని ముద్దాడేందుకు రోహిత్ సేన చూస్తుండగా.. దక్షిణాఫ్రికా కూడా మొదటిసారి ప్రపంచ కప్ టైటిల్ను గెలువాలని చూస్తోంది. ఇదిలా ఉంటే.. 2024 టీ20 ప్రపంచకప్కు ఐసీసీ ఇప్పటికే ప్రైజ్ మనీ ప్రకటించిన విషయం తెలిసిందే.. ఈసారి ప్రైజ్ మనీ గణనీయంగా పెరిగింది. అయితే.. ప్రైజ్ మనీ గెలిచిన జట్టుకే కాకుండా.. ఓడిపోయిన జట్టుకు లభిస్తుంది. టీ20 ప్రపంచకప్ ప్రైజ్ మనీ ఎంతో ఉందో చూద్దాం.
టీ20 ప్రపంచ కప్ 2024 ప్రైజ్ మనీ ఈసారి టీ20 ప్రపంచ కప్ 2024 కోసం.. ఐసీసీ (ICC) ప్రైజ్ మనీ 11.25 మిలియన్ డాలర్లు, దాదాపు రూ. 93.7 కోట్లు ప్రకటించింది. భారత్ వర్సెస్ సౌతాఫ్రికా ఫైనల్లో విజేతగా నిలిచిన జట్టుకు 2.45 మిలియన్ డాలర్లు, అంటే దాదాపు రూ. 20.42 కోట్లు లభించనుంది. అలాగే ఓడిపోయిన జట్టుకు 1.28 మిలియన్ డాలర్లు, అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ. 10.67 కోట్లు దక్కనుంది.
ఓడిన జట్లకు ఎంత మొత్తంలో డబ్బులు లభించనున్నాయంటే..!ఇండియా, సౌతాఫ్రికాతో పాటు.. 2024 టీ20 ప్రపంచ కప్లో సెమీ-ఫైనల్కు చేరుకున్న ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్ జట్లకు $ 7,87,500 అంటే దాదాపు రూ. 6.5 కోట్ల ప్రైజ్ మనీ దక్కుతుంది. ఈ టాప్-4 జట్లతో పాటు సూపర్-8లో చోటు దక్కించుకున్న అమెరికా, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, బంగ్లాదేశ్లకు రూ.3.17 కోట్లు లభిస్తాయి. 2024 టీ20 ప్రపంచకప్లో మొత్తం 20 జట్లు పాల్గొన్నాయి. 9 నుంచి 12వ ర్యాంక్లో నిలిచిన జట్లకు సుమారు రూ.2.06 కోట్లు, 13 నుంచి 20వ ర్యాంక్లో నిలిచిన జట్లకు రూ.1.87 కోట్లు ప్రైజ్ మనీ అందించనున్నారు.