-Advertisement-

Crime: ప్రియుడి మోజులో భర్త హత్య

Daily telugu Daily trending news Breaking news telugu Telugu news Telugu stories Crime News Politics news Current Affairs pdf Today Latest headlines
Pavani

ప్రియుడి మోజులో భర్త హత్య

• సుపారీ ఇచ్చి హత్య చేయించిన భార్య

• ఆదిలాబాద్ టీచర్ హత్య కేసును ఛేదించిన పోలీసులు

ఆదిలాబాద్, జూన్ 15 (పీపుల్స్ మోటివేషన్ ):

జిల్లాలో ప్రభుత్వ టీచర్ హత్య కేసులో సంచలన విషయాలు బయట కొచ్చాయి. ప్రియుడి మోజులో పడిన భార్యనే సుఫారీ ఇచ్చి భర్తను దారుణంగా హత్య చేయించినట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. భార్య కదలికలపై అనుమానం వచ్చి ఆమె సెల్ఫోన్ను చెక్ చేయగా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భర్త స్కూలుకు వెళ్లగానే ప్రియుడిని ఇంటికి పిలిపించుకుని ఎంజాయ్ చేయడం, వాటిని ఫోన్లో ఫొటోలు తీసుకున్నట్లుగా కూడా గుర్తించారు. ఇప్పుడు ఆఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా కూడా మారాయి. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం నాగులకొండకు చెందిన గజేందర్.. జైనథ్ మండలం కెనాల్ మేడిగూడలో గవర్నమెంట్ టీచర్ గా పని చేస్తున్నాడు. భార్య విజయలక్ష్మితో కలిసి సంతోషంగా జీవిస్తున్నాడు. అయితే మహేశ్ అనే యువకుడితో విజయలక్ష్మీ అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్త ఉద్యోగానికి వెళ్లిపోగానే ప్రియుడితో కలిసి షికార్లు చేసేది, అతనితో ఎంజాయ్ చేస్తూ.. వాటిని ఫొటోలు తీసి మధుర జ్ఞాపకాలుగా ఫోన్లోనే దాచి పెట్టుకుంది. అయితే కొద్దిరోజులుగా వేసవి సెలవులు ఉండటంతో వాళ్లిద్దరూ కలుసుకోవడానికి కుదరలేదు. దీంతో భర్త ఉంటే ఎప్పటికైనా తమకు అడ్డే అని భావించిన విజయలక్ష్మి అతన్ని హత్య చేయాలని భావించింది. ప్రియుడితో కలిసి భర్త మర్దర్కు స్కెచ్ వేసింది. ఒక సుపారీ గ్యాంగ్ను కూడా సంప్రదించి.. తన భర్త గురించి పూర్తి వివరాలను వెల్లడించింది. స్కూల్ రీఓపెన్ రోజున ప్లాన్ చేసి గజేందరన్ను చంపేశారు.

Daily telugu Daily trending news Breaking news telugu Telugu news Telugu stories Crime News Politics news Current Affairs pdf Today Latest headlines
ఆతర్వాత ఏం తెలియనట్టుగా విజయలక్ష్మీ తన భర్త కనిపించడం లేదని గజేందర్ భార్య విజయలక్ష్మీ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసింది. విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఇంతలో గాదేగూడ మండలం పర్సువాడ వద్ద జూన్ 12వ తేదీన ఒక మృతదేహం అనుమానాస్పద రీతిలో కనిపించింది. దీంతో గజేందర్ను ఎవరు హత్య చేసి ఉంటారని పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో విచారణ చేస్తున్న పోలీసులకు భార్య విజయలక్ష్మీ కదలికలపై అనుమానం వ్యక్తమైంది. దీంతో ఆమె సెల్ఫోన్ స్వాధీనం చేసుకుని కాల్ డేటాను పరిశీలించారు. ఆ ఫోన్లో ఉన్న ఫొటోలను కూడా చూసి షాకయ్యారు. ప్రియుడి కోసమే భర్తను హత్య చేయించిందని పోలీసులు నిర్ధారించారు. ప్రియుడు మహేశ్తో పాటు విజయలక్ష్మిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు మరో ఇద్దరిని అదుపులోకితీసుకున్నారు.
Comments

-Advertisement-