Curry leaves: కరివేపాకే అని తీసేస్తున్నారా.. అలా చేయడం ఎంత నష్టమంటే..?
కరివేపాకే అని తీసేస్తున్నారా.. అలా చేయడం ఎంత నష్టమంటే..?
మనలో చాలామంది ఇప్పటికి కూడా ఏ కూరలో కరివేపాకు వచ్చినా సరే దానిని తినకుండా పక్కన తీసి అవతలపడేస్తాం. అయితే ఇలా చేయడం వల్ల చాలా నష్టం కలుగుతుందని ఈమధ్య కొందరు నిపుణులు తెలిపారు. ప్రతిరోజు కరివేపాకును మన ఆహారంలో జోడించుకుంటే ఎలాంటి ఉపయోగాలు చేకూరుతాయ తెలియజేశారు. ఇకపోతే ఆ వివరాలు ఏంటో ఒకసారి చూస్తే..
కరివేపాకును ఆహారంలో చేర్చుకుంటే అందులో ఉన్న క్యాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ లాంటి ఖనిజాలతో పాటు విటమిన్ ఏ, బి, సి, ఈ లు కూడా పుష్కలంగా లభిస్తాయి. వీటితోపాటు కార్బొజోల్ ఆల్కలాయిడ్స్ అధికంగా ఉండడం ద్వారా బరువు తగ్గడంలో ఎంతగానో సాయపడతాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు కొన్ని తాజా కరివేపాకులను తినాలని నిపుణులు సూచిస్తున్నారు.
వీటితోపాటు జీర్ణక్రియ కూడా కరివేపాకు ఎంతగానో సహకరిస్తుందని తెలియజేశారు. అలాగే షుగర్ వ్యాధితో బాధపడే వారికి రక్తంలో చెక్కర స్థాయిలో నియంత్రించడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిలో విటమిన్ A అధికంగా ఉండడం వల్ల కంటి ఆరోగ్యం బాగుపడుతుంది. ఈ ఆకుల వాసన పీల్చడం ద్వారా ఒత్తిడి, ఆందోళన లాంటి సమస్యలు దరిచేరవు. కరివేపాకులో ఉండే కార్బోజ్జోల్ ఆల్కలాయిడ్స్ లు బాడీలోని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తగ్గించడం సమర్థవంతంగా పనిచేస్తాయి. అలాగే తెల్ల జుట్టుతో ఇబ్బందులు పడుతున్న వారు కూడా ఇలా రోజువారీ ఆహారము కరివేపాకు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. వీటి ఫలితంగా అల్జీమర్స్ వంటి వ్యాధులను కూడా దూరం చేస్తుంది. వీటిని రోజు తినడం ద్వారా రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రణలో ఉంటాయి. దీంతో గుండె సంబంధించిన వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. అలాగే ఆడవారిలో కూడా బాగా పనిచేస్తుంది.