-Advertisement-

Driving Rules: మీరు రాంగ్ రూట్లో వెళ్తున్నారా అయితే ఇది ఒకసారి చదవండి..!

Traffic rules 10 points Driving rules in India PDF Driving rules and regulations PDF Traffic rules Road safety rules 5 traffic rules Telugu daily news
Priya

Driving Rules: మీరు రాంగ్ రూట్లో వెళ్తున్నారా అయితే ఇది ఒకసారి చదవండి..!

రాంగ్ రూట్ వెళ్తున్నారా తస్మాత్ జాగ్రత్తా..

రాంగూట్లో వెళ్తే మూడేండ్ల వరకు శిక్ష..

శుక్రవారం ఒక్కరోజే 93 మందిపై కేసులు నమోదు..

మందిపై ఎఫ్ఐఆర్ లు నమోదు..

Wrong Route Driving: రాంగ్ రూట్ లో ప్రయాణం చేసేవారి పై పోలీసులు గస్తీ కాసి కొరడా ఝురి చూపిస్తున్నారు. ఇటీవలి కాలంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో చాలా వరకు రాంగ్ సైడ్ డ్రైవింగ్ కేసులే కావడంతో ట్రాఫిక్ నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయాలని సైబరాబాద్ పోలీసులు నిర్ణయించారు. పట్టుపడిన వారిపై ఎస్ఐఆర్ నమోదు చేసి జైలుకు పంపనున్నారు. ఇందులో భాగంగా తొలిసారిగా రాంగ్ రూట్లో ప్రయాణించే వాహనదారులపై సెక్షన్ 336 కింద ఎస్ఐఆర్ నమోదు చేయడం ప్రారంభించారు. రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన వారిపై సంబంధిత లా అండ్ ఆర్డర్ స్టేషన్లో ఎఫ్ఎఆర్ నమోదు చేయబడుతుంది మరియు ఛార్జిషీట్ దాఖలు చేయబడుతుంది.

Traffic rules 10 points Driving rules in India PDF Driving rules and regulations PDF Traffic rules Road safety rules 5 traffic rules Telugu daily news

నిన్న శుక్రవారం కమిషనరేట్ పరిధిలో రాంగ్ వే వాహనాలు నడుపుతున్న 93 మందిపై కేసులు నమోదు చేశారు. వీరిలో 11 మందిపై ఎస్ఐఆర్లు నమోదు చేశారు. స్టేషన్ల వారీగా చూస్తే గచ్చిబౌలి పీఎస్ పరిధిలో రాంగ్ రూట్లో ప్రయాణిస్తున్న 32 మంది పట్టుబడ్డారు. వీరిలో నలుగురిపై ఎఫ్ఆర్ు నమోదు చేశారు. కేపీహెచ్బీ పీఎస్ పరిధిలో ఐదుగురిని పట్టుకుని ఒకరిపై ఎఫ్ఎఆర్ నమోదు చేశారు.

కూకట్పల్లి పరిధిలో ముగ్గురిని, మాదాపూర్లో ఒకరిని, నార్సింగి ఠాణాలో 11 మందిని, రాయదుర్గంలో 20 మందిని, జీడిమెట్లలో 16 మందిని అరెస్టు చేసి, ఒకరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రాంగ్ రూట్లో ప్రయాణించడం వల్ల రాంగ్ సైడ్ వాహనదారులే కాకుండా ఇతర వాహనదారులు కూడా ప్రమాదంలో పడ్డారు. తప్పుగా నడపడం చాలా ప్రమాదకరం. జరిమానాలు విధిస్తున్నా నిబంధనల ఉల్లంఘన తగ్గడం లేదు. అందువల్ల రాంగ్ రూట్ డ్రైవింగ్ చేసే వాహనదారులపై సెక్షన్ 336 కింద ఎఫ్ఎఆర్ నమోదు చేస్తున్నాం. ఈ కేసుల్లో మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. కొన్నిసార్లు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించవచ్చు. గతంలో రాంగ్ రూట్ డ్రైవర్లపై ఎస్ఐఆర్ నమోదు చేయలేదు. గత నెలలో తొలిసారిగా ఈ విధానాన్ని అమలు చేశాం. గత నెలలో కమిషనరేట్ పరిధిలో మొత్తం 250 వాహనాలపై కేసులు పెట్టారు. కమిషనరేట్లో 124 ప్రాంతాలను గుర్తించాం, అక్కడ తరచుగా రంగూట్కు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ANPR కెమెరాలను ఏర్పాటు చేస్తున్నాం. ఈ కెమెరాలు తప్పు చేసిన వారిని గుర్తించి ఫొటోలు తీస్తాయి. వాటి ఆధారంగా నిబంధనలు అతిక్రమించిన వాహనదారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు.

Comments

-Advertisement-