DSCతో త్వరలో టీచర్ పోస్టులను భర్తీ చేస్తాం..CM
Ts tet 2024 Results, Ts dsc notification, ts dsc shedule, ys dsc exam dates, ap tet key, ap dsc hall tickets, ap tet latest news
AP Dsc exam dates
Tet
By
Peoples Motivation
DSCతో త్వరలో టీచర్ పోస్టులను భర్తీ చేస్తాం..CM
వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం
వందేమాతరం ఫౌండేషన్ ప్రభుత్వ పాఠశాలలను ప్రోత్సహిస్తోందని ప్రశంస
ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం రూ.80వేలు ఖర్చు చేస్తోందన్న ముఖ్యమంత్రి
డీఎస్సీ ద్వారా త్వరలో టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాదులోని రవీంద్రభారతిలో వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో టెన్త్ టాపర్లకు పురస్కారాలు అందించారు. విద్యార్థుల సన్మాన కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వందేమాతరం ఫౌండేషన్‌ను అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు.
ఇప్పుడు సర్వీసుల్లో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్‌లలో 90 శాతం మంది ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివినట్లు సీఎం చెప్పారు. చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, కేంద్రమంత్రులు కూడా పాఠశాలల్లోనే చదివారన్నారు. గత కొంతకాలంగా ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమవుతున్నాయన్నారు. ఒక్కో విద్యార్థి మీద ప్రభుత్వం రూ.80వేలు ఖర్చు చేస్తోందన్నారు. పిల్లలను చేర్పించకపోతే స్కూలు మూతపడుతుందని బడిబాట ద్వారా పేరెంట్స్ కు టీచర్లు అవగాహన కల్పించాలి' అని ఆయన కోరారు.
Comments