Farmer: అధికారులకు ఒక యువ రైతు దరఖాస్తు..! పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిని వెతికిపెట్టండి..!
Farmer: అధికారులకు ఒక యువ రైతు దరఖాస్తు..! పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిని వెతికిపెట్టండి..!
ప్రస్తుతం చాలా మంది యువకులకు మూడు పదుల వయసు దాటుతున్నా పెళ్లిళ్లు కావడం లేదు. నాలుగు పదుల వయసున్న వారు సైతం ఉన్నారు. అయితే, పెళ్లి కోసం అమ్మాయిలను వెతికితే.. అందరూ అబ్బాయి ప్రభుత్వ ఉద్యోగం, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు కావాలని అంటున్నారు. ఇలాంటి కోరికలతో చాలా మంది యువకులు పెళ్లిళ్లు కావడం లేదు. ముఖ్యంగా వ్యవసాయ చేస్తున్న యువరైతులను పెళ్లి చేసుకునేందుకు ఎవరూ ముందుకురావడం లేదు. ఈ క్రమంలో ఓ యువ రైతు తనకు వధువును వెతికి పెట్టాలంటూ అధికారులకు దరఖాస్తు పెట్టుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక కొప్పాల్ జిల్లాకు చెందిన సంగప్ప వ్యవసాయం చేస్తూ వస్తున్నాడు.
రైతుల సమస్యలను తెలుసుకునేందుకు జిల్లా అధికారులు స్థానికంగా ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి హాజరైన సంగప్ప పెళ్లి చేసుకునేందుకు తనకు ఓ అమ్మాయిని వెతికి పెట్టండంటూ జిల్లా కమిషనర్ నళిని అతుల్‌ను కలిసి అర్జీ పెట్టుకున్నాడు. తాను పదేళ్లుగా వధువు కోసం వెతుకుతున్నానని.. పెళ్లికి ఎవరూ ముందుకురావడంలేదని చెప్పాడు. గత దశాబ్దకాలంగా జరుగుతున్న ఈ పరిణామంతో మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిందన్నారు. వధువు కోసం తనకు సహాయం చేయాలని కోరారు. సమావేశంలో సంగప్ప ఇచ్చిన దరఖాస్తు కర్ణాటకలో పరిస్థితికి అద్దంపడుతున్నది. గతంలోనూ పలువురు యువకులు తమకు పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిలను చూడాలంటూ అధికారులకు వినపత్రాలు అందించిన సందర్భాలు ఉన్నాయి.