Gold Rates: ఆకాశాన్ని తాకుతున్న పసిడి ధరలు..నేటి ధరలు ఇలా!
Gold Rates: ఆకాశాన్ని తాకుతున్న పసిడి ధరలు..నేటి ధరలు ఇలా!
మొన్నటివరకు రూ.2 వేలకు వరకు తగ్గిన బంగారం ధరలు.. మళ్లీ షాకిస్తున్నాయి. రెండు రోజులుగా పసిడి ధరలు భారీ పెరిగాయి. నిన్న తులం బంగారంపై రూ.150 పెరగ్గా.. నేడు రూ.300 పెరిగింది. బుధవారం (జూన్ 12) బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,150 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.72,160గా ఉంది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి. నేటి రేట్స్ ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.
నేడు హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,150గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,160గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల ధర రూ.66,300 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.72,310గా నమోదైంది. ముంబైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.66,150 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.72,160గా ఉంది. బెంగళూరు, కోల్‌కతా, కేరళలలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,150 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.72,160గా ఉంది.
నేడు వెండి ధరలు కూడా పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై రూ.800 పెరిగి.. రూ.91,300గా ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.91,300 ఉండగా.. ముంబైలో సైతం రూ.91,300గా ఉంది. చెన్నైలో కిలో వెండి రూ.95,800లుగా నమోదవగా.. బెంగళూరులో అత్యల్పంగా రూ.90,150గా నమోదైంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.95,800లుగా ఉంది.