Gold Rates: భారీగా తగ్గిన పసిడి ధరలు.. అదే బాటలో వెండి ధరలు
Gold Rates: భారీగా తగ్గిన పసిడి ధరలు.. అదే బాటలో వెండి ధరలు
మగువలకు గుడ్యూస్
నేడు రూ.870 తగ్గింది
బంగారం బాటలోనే వెండి
బంగారం కొనుగోలుదారులకు గుడ్న్యూస్. వరుసగా రెండు రోజులు భారీగా పెరిగిన పసిడి ధరలు.. నేడు ఊహించని రీతిలో తగ్గాయి. గత రెండు రోజుల్లో వరుసగా రూ.220, రూ.810 పెరగగా.. నేడు రూ.870 తగ్గింది. శనివారం (జూన్ 22) బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,350 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.72,380గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి పసిడి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,500 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.72,530గా నమోదైంది. ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.66,350గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.72,380గా ఉంది. చెన్నెలో 22 క్యారెట్ల ధర రూ.66,950గా.. 24 క్యారెట్ల ధర రూ.73,040గా నమోదైంది. బెంగళూరు, కోల్కతా, పూణే, కేరళ, హైదరాబాద్లలో 22 క్యారెట్ల ధర రూ.66,350 కాగా.. 24 క్యారెట్ల ధర 72,380 గా ఉంది.
నేడు వెండి ధరలు కూడా బంగారం బాటలోనే నడిచాయి. బులియన్
మార్కెట్లో కిలో వెండిపై రూ2,000తగి.రూ92,000గా నమోదైంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.92,000గా ఉండగా.. ముంబైలో రూ.92,000గా ఉంది. చెన్నెలో కిలో వెండి రూ.96,500లుగా నమోదవగా.. బెంగళూరులో రూ.92,950గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.96,500లుగా నమోదైంది.