Group-2: గ్రూప్ 2 వాయిదా పడేనా..? అభ్యర్థుల్లో అయోమయం..!
Group-2: గ్రూప్ 2 వాయిదా పడేనా..? అభ్యర్థుల్లో అయోమయం..!
అమరావతి, (పీపుల్స్ మోటివేషన్):-
మెయిన్స్ పరీక్షల తేదీలు దగ్గర పడటంతో అభ్యర్థలలో అయోమయం నెలకొందని గ్రూప్-2 ప్రధాన పరీక్ష(మెయిన్స్) ను కొద్ది నెలల పాటు వాయిదా వేయాలని నిరుద్యోగ అభ్యర్థులు వాపోతున్నారు. గత ప్రభుత్వం అయిదేళ్లు కాలయాపన చేసి, ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ ప్రయోజనం కోసం నోటిఫికేషన్ ఇచ్చిందని పేర్కొన్నారు. హడావుడిగా ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిందని గుర్తుచేశారు. ఇంతలోనే ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో చాలా మంది నిరుద్యోగ అభ్యర్థులు మెయిన్స్ కు సన్నద్ధం కావడానికి ఆటంకం ఏర్పడిందన్నారు. కొందరు ఎన్నికల విధుల్లో పాల్గొనడం వల్ల పరీక్షలకు సన్నద్ధం కాలేకపోయారని, ఈ నేపథ్యంలో గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలని ఓ ప్రకటనలో కోరారు. అలాగే డిప్యూటీ డీఈఓ మెయిన్స్ కు 1:100 రేషియోతో మెయిన్స్ కు ఎంపిక చేయాలని అభ్యర్థులు కోరుతున్నట్లు సమాచారం. ప్రస్తుత ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటివరకు దీనిపై స్పందించకపోవడంతో గ్రూప్ 2 అభ్యర్థులు అయోమయంలో ఉన్నట్లు తెలుస్తోంది.