Health tips: మొటిమల బాధ తగ్గాలంటే...ఈ జాగ్రత్తలు పాటించండి..!
Health tips: మొటిమల బాధ తగ్గాలంటే...ఈ జాగ్రత్తలు పాటించండి..!
యుక్తవయసులో మొటిమలు సర్వ సాధారణ సమస్య. దీనికి మూలం హార్మోన్ల మార్పులు. సాధారణంగా మొటిమలు ముఖం మీదే కనిపించినప్పటికీ కొన్నిసార్లు వీపు, ఛాతీ, భుజాల మీదా రావొచ్చు. కొన్ని జాగ్రత్తలతో వీటి బాధను తగ్గించుకోవచ్చు.
యుక్తవయసులో మొటిమలు సర్వ సాధారణ సమస్య. దీనికి మూలం హార్మోన్ల మార్పులు. సాధారణంగా మొటిమలు ముఖం మీదే కనిపించినప్పటికీ కొన్నిసార్లు వీపు, ఛాతీ, భుజాల మీదా రావొచ్చు. కొన్ని జాగ్రత్తలతో వీటి బాధను తగ్గించుకోవచ్చు.
ముఖం శుభ్రంగా: రోజుకు రెండు సార్లు ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. దీంతో చర్మం జిడ్డు తగ్గుతుంది. మృతకణాలు వదిలిపోతాయి. అలాగని ఎక్కువసార్లు ముఖం కడుక్కుంటే మేలు కన్నా కీడే ఎక్కువ. కఠినమైన సబ్బులు చర్మాన్ని చికాకు పరుస్తాయి. కాబట్టి మృదువైన సబ్బులనే వాడుకోవాలి. తువ్వాలుతో గట్టిగా రుద్దటం వంటివి చేయొద్దు. మెత్తటి తువ్వాలును ముఖానికి అద్దుతూ సున్నితంగా తుడుచుకోవాలి.
గిల్లొద్దు: తరచూ చేతులను ముఖానికి తాకిస్తుంటే బ్యాక్టీరియా వ్యాపించే అవకాశముంది. అప్పటికే ఉబ్బి ఉన్న చర్మం మరింత చికాకుకు గురవుతుంది. అలాగే మొటిమలను గిల్లటం, గోకటం, నొక్కటం వంటివేవీ చేయొద్దు. దీంతో బ్యాక్టీరియా మరింత లోపలికి వెళ్లి ఇన్ఫెక్షన్కు దారితీయొచ్చు.
మలాములు: మొటిమలు తగ్గటానికి మందుల దుకాణాల్లో దొరికే లేపనాలు వాడుకోవచ్చు. వీటిల్లో చాలావరకూ బెంజైల్ పెరాక్సైడ్, శాలిసైలిక్ యాసిడ్, గ్లైకాలిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్ వంటివి ఉంటాయి. ఇవి బ్యాక్టీరియాను నిర్మూలిస్తాయి. అయితే వీటిని ముందు కొద్ది మోతాదులోనే వాడుకోవాలి. ఫలితాలను బట్టి ఎంత వాడుకోవాలో నిర్ణయించుకోవాలి.
మేకప్ జాగ్రత్త: మొటిమలు ఉదృతంగా ఉన్నప్పుడు ఫౌండేషన్, పౌడర్ అద్దుకోవద్దు. ఒకవేళ మేకప్ వేసుకుంటే రాత్రిపూట పూర్తిగా తుడిచేసుకోవాలి. వీలుంటే నూనె లేని సౌందర్య సాధనాలు వాడుకోవాలి. మొటిమలకు కారణం కానివి ఎంచుకోవాలి.
షాంపూతో తలస్నానం: తల మీది నూనె నుదురుకు తాకి,మొటిమలు వచ్చే అవకాశముంది. అప్పటికే ఉన్న మొటిమలు మరింత ఎక్కువ కావొచ్చు కూడా. కాబట్టి మృదువైన షాంపూతో శుభ్రంగా తలస్నానం చేయాలి. తలకు నూనె రాసుకోవద్దు. ఇది ముఖం మీదికి వ్యాపించి, చర్మరంధ్రాలను మూసేయొచ్చు. పొడవైన జుట్టున్నట్టయితే ముఖం మీదికి రాకుండా చూసుకోవాలి.
ఎండ తగలనీయొద్దు: ఎండలోని అతి నీలలోహిత కిరణాలు చర్మంలో వాపు పక్రియను. ఎరుపును పేరేపిసాయి.ఎండ తగలనీయొద్దు: ఎండలోని అతి నీలలోహిత కిరణాలు చర్మంలో వాపు ప్రక్రియను, ఎరుపును ప్రేరేపిస్తాయి. మొటిమలు తగ్గటానికి వాడే కొన్ని మందులు ఎండకు అతిగా స్పందించే అవకాశమూ ఉంది. కాబట్టి వీలైనంతవరకూ ముఖానికి ఎండ తగలకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య మరింత జాగ్రత్త అవసరం. ఎండలోకి వెళ్లినప్పుడు సన్స్టీన్ లోషన్లు రాసుకోవాలి.
ఆహారం: వేపుళ్లు, కొవ్వు పదార్థాలు తగ్గించాలి. తాజా కూరగాయలు, పండ్లు ఎక్కువగా తినాలి. పాల ఉత్పత్తులు, చక్కెర ఎక్కువగా ఉండే మిఠాయిల వంటివి మొటిమలను ప్రేరేపించే అవకాశముంది. కాబట్టి వీటి విషయంలో జాగ్రత్త అవసరం.
రోజూ వ్యాయామం: ఇది చర్మంతో పాటు శరీరం మొత్తం ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడుతుంది. వ్యాయామం చేసిన వెంటనే స్నానం చేయటం మరవద్దు.
ప్రశాంతంగా: మానసిక ఒత్తిడితో మొటిమలు తీవ్రమయ్యే అవకాశముందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. కాబట్టి మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నించాలి. యోగా, ధ్యానం వంటివి ఇందుకు ఉపయోగపడతాయి.