రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

High Court: బక్రీద్ సందర్భంగా గోవధ జరగకుండా చూడాలి: హైకోర్టు ఆదేశాలు

Pavani

High Court: బక్రీద్ సందర్భంగా గోవధ జరగకుండా చూడాలి: హైకోర్టు ఆదేశాలు

గోవధ జరగకుండా చూడాలని బీజేపీ నేత రాజాసింగ్ లంచ్ మోషన్ పిటిషన్

గోవులను అక్రమంగా చంపితే చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు

గోవులను తరలించకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలన్న హైకోర్టు

బక్రీద్ సందర్భంగా గోవధ జరగకుండా చూడాలని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. గోవధ జరగకుండా చూడాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గోవులను అక్రమంగా చంపితే చర్యలు తీసుకోవాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. గోవులను తరలించకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని తెలిపింది.

జంతు వధ చట్టాన్ని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. మూడు కమిషనరేట్ల పరిధిలో 150 చెక్ పోస్టులు పెట్టామని పోలీసులు తెలిపారు. గోవుల తరలింపుపై ఇప్పటికే 60 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. గోవధ నిషేధ చట్టం అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది.

Comments

-Advertisement-