House: మీ ఇంటి ఆవరణంలో పాములు తిరుగుతున్నాయా...ఈ మొక్కల వల్ల దరిచేరవు తెలుసా..!
ఇల్లు: మీ ఇంటి ఆవరణలో పాములు తిరుగుతున్నాయా...ఈ మొక్కల వల్ల దరిచేరవు తెలుసా..!
.సాధారణంగా వర్షాకాలం అంటే పాములు సంచరించే కాలం
.గుబురుగా పెరిగిన మొక్కలే పాములకు ఆవాసం
.పాలములు మీ ఇంటి దరిదాపులకు రాకుండా ఉండాలంటే ఇలా చేయండి..
సాధారణంగా వర్షాకాలం రైతులకు అతి ముఖ్యమైనది. వర్షాలు సమద్ధిగా కురిస్తేనే పాడిపంటలతో దేశం సస్యశ్యామలమవుతుంది. వర్షాకాలంలో రకరకాల ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. సాధారణంగా వర్షాకాలం అంటే పాములు సంచరించే కాలం. వర్షాకాలంలో వర్షాలకు ప్రకతి మొత్తం పచ్చగా తయారవుతుంది. ఎక్కడ చూసినా ఏపుగా పెరిగిన గడ్డి దుబ్బులు, బహిరంగ ప్రదేశాల్లో గుబురుగా పెరిగిన మొక్కలు వెరసి అది పాములకు అడ్డాగా మారుతుంది. ఏటేటా జూన్ నుంచి సెప్టెంబర్ నెల వరకు వర్షాకాలం కావడంతో విషకీటకాలు కూడా విజృంభిస్తాయి. పంట పొలాలకు నీరుపెట్టేందుకు వ్యవసాయ పనులకు పగలూ రాత్రి తేడా ఎప్పుడంటే అప్పుడు రైతులు వెళ్లి వస్తుంటారు. ఇంటికి సమీపంలో గుబురు పొదలుంటే చాలా ప్రమాదం. అందులో నుంచి పాములు వచ్చే అవకాశం ఉంటుంది.. పాలములు మీ ఇంటి దరిదాపులకు రాకుండా ఉండాలంటే ఇలా చేయండి.పాము అంటే భయపడే జీవి. భారతీయ సంస్కృతిలో దానికి ఎంతో గుర్తింపు ఉంది. ఈ పామును హిందూమతంలో దేవతగా పూజిస్తారు. కానీ ఈ విష జీవిని చూడగానే వెన్నులో వణుకు వస్తుంది. కానీ దాన్ని చంపడానికి ఇష్టపడరు. ఇది మంచి నిర్ణయమే. ఆ పాములను తిని బతికే జీవులకు ఆహారం మిస్సవ్వదు. ఈ విషసర్పాలు పారిపోయేలా చేసే అంశాలు ఈ ప్రపంచంలో ఉన్నాయని మీకు తెలుసా? ఈ అంశాలన్నీ మన చేతులకు దగ్గరగా ఉన్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రజలు చాలా భయపెట్టే పాములు, ప్రపంచంలోని కొన్ని వస్తువుల వాసనలను తట్టుకోలేవు. ఆ పాము తనను తాను రక్షించుకోవాలి అనుకుంటుంది. ఇంట్లోని వారు తనను చంపగలరు అని అనిపిస్తుంది. అందువల్ల ప్రాణ భయంతో ఆ పాము చాలా దూకుడుగా ఉంటుంది. ట్రైలర్.. ఫస్ట్ రోజు చూడాల్సిందేన జక్కన్న..కొన్ని రకాల మొక్కల్ని ఇంటి దగ్గర పెంచుకుంటే పాములు ఇంటివైపు రావు. పాము ఏ వాసన నుంచి పారిపోతుంది?జాబితాను చూడండి:- వెల్లుల్లి, ఉల్లిపాయ పాములనుతరిమికొడతాయి. ఈ రెండూ ప్రతి ఇంట్లోనూ ఉంటాయి. అయితే వీటి వాసనను పాములు తట్టుకోలేవని చాలా మందికి తెలియదు. పుదీనా, తులసి మొక్కల వాసనను పాములు తట్టుకోలేవు. అందుకే భారతీయుల ఇళ్లలో తులసి మొక్కలు నాటడం ఏళ్ల తరబడి ఆనవాయితీగా వస్తోంది. ఏజ్-యానిమల్ అనే వెబ్‌సైట్ ప్రకారం, పాములు తట్టుకోలే వాసనలు 14 రకాలుగా ఉన్నాయి. నిమ్మరసం, వెనిగర్, దాల్చినచెక్క నూనె కలిపి స్ప్రే చేస్తే పాము వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి. అమ్మోనియా వాయువు వాసన కూడా పాములకు విసుగు తెప్పిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, పాములు ఈ వాసన నుంచి పారిపోతాయి. పెద్ద శబ్దాలకు పాములు కూడా చాలా భయపడతాయి. ఒక అధ్యయనం ప్రకారం, పాములు తమ వినికిడి శక్తి ద్వారా మాత్రమే తమ ఆహారాన్ని ప్రదర్శిస్తాయి. శబ్దాలు వస్తూ ఉంటే.. పాములు రావు. తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు, మన చేతుల దగ్గరే ఉంటే కిరోసిన్ వాసనను కూడా పాములు తట్టుకోలేవు.