Hypertension: వ్యాయామం ఎక్కువగా చేస్తే హై బీపీ రాదా..?
Hypertension: వ్యాయామం ఎక్కువగా చేస్తే హై బీపీ రాదా..?
హై బీపీ నివారణపై ప్రస్తుత మార్గదర్శకాలను మార్చాలని ఓ అధ్యయనం అభిప్రాయపడింది. పెద్దల శారీరక శ్రమలో కనీస ప్రమాణాల్ని రెట్టింపు చేయాలని, తద్వారా హై బీపీని నివారించవచ్చునని పరిశోధకులు తెలిపారు.
హై బీపీ నివారణపై ప్రస్తుత మార్గదర్శకాలను మార్చాలని ఓ అధ్యయనం అభిప్రాయపడింది. పెద్దల శారీరక శ్రమలో కనీస ప్రమాణాల్ని రెట్టింపు చేయాలని, తద్వారా హై బీపీని నివారించవచ్చునని పరిశోధకులు తెలిపారు. ఈ మేరకు 5 వేల మందిపై యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన పరిశోధకులు చేసిన అధ్యయనాన్ని ‘అమెరికన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్’ ప్రచురించింది.
హై బీపీ సమస్య పెరగడానికి కారణం..18 నుంచి 40 ఏండ్ల వాళ్లలో వ్యాయామం చేసేవాళ్లు గణనీయంగా తగ్గడమేనని నివేదిక తెలిపింది. వైద్య నిపుణుడు జాసన్ నాగట మాట్లాడుతూ, ‘యుక్త వయస్సులో ఉన్న సగం మందిలో శారీరక శ్రమ సాధారణ స్థాయి కన్నా తక్కువగా ఉంది. దీనికి, రక్తపోటు ఆరంభానికి సంబంధం ఉంది. ఈ నేపథ్యంలో శారీరక శ్రమ కనీస ప్రమాణాన్ని పెంచాల్సిన అవసరముంది. దీనిని రెట్టింపు చేయటం ద్వారా హై బీపీని నివారించవచ్చు’ అని అన్నారు.