Indian Navy Agniveer 2024: ఇండియన్ నేవీ అగ్నివీర్ రిక్రూట్మెంట్ ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి..
Indian Navy Agniveer 2024: ఇండియన్ నేవీ అగ్నివీర్ రిక్రూట్మెంట్ ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి..
నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. నేవిలో ఉద్యోగం చెయ్యాలనుకొనేవారికి అదిరిపోయే న్యూస్.. తాజాగా ప్రభుత్వం ఇండియన్ నేవిలో ఉన్న పలు పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది భారత నౌకాదళం.అర్హులైన అభ్యర్థులు joinindiannavy.gov.in ఇండియన్ నేవీ అధికారిక వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.. జూలై 11 లోపు ఈ పోస్టులను అప్లై చేసుకోవచ్చు.. ఈ పోస్టులకు అర్హతలు ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ గుర్తించిన బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్జ్యుకేషన్ నుంచి మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి..
ఎంపిక పక్రియ..
ప్రిలిమినరీ స్క్రీనింగ్ టెస్ట్, ఫైనల్ స్క్రీనింగ్ టెస్ట్లో ప్రతిభ ఆధారంగా మెరిట్ క్రమం ఆధారంగా నియామకాల ఎంపిక జరుగుతుంది.. షార్ట్స్ట్ చేసిన అభ్యర్థులకు ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ (పీఎఫ్టీ), మ్యూజిక్ స్క్రీనింగ్ టెస్ట్, రిక్రూట్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్తో కూడిన స్టేజ్-1కు కాల్-అప్ లెటర్ ఇస్తారు.. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి..
జీతం..
ఈ పోస్టులకు ఎంపికైన వారికి ఏడాది తరవాత జీతం పెరిగే అవకాశం ఉంది.. నెలకు రూ.30,000 ప్యాకేజీ చెల్లిస్తారు. వీటితో పాటు రిస్క్, కష్టాలు, దుస్తులు, ట్రావెల్ అలవెన్సులు ఉంటాయి..
ఈ పోస్టులకు ఎలా అప్లె చేసుకోవాలంటే?
ముందుగా ఇండియన్ నేవి అధికార వెబ్ సైట్ joinindiannavy.gov.in వద్ద ఇండియన్ నేవీ అధికారిక వెబ్సైట్ని సందర్శించండి..
హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న ఇండియన్ నేవీ అగ్నివీర్ రిక్రూట్మెంట్ 2024 లింక్పై క్లిక్ చేయండి..
దరఖాస్తు లింక్ అందుబాటులో ఉన్న చోట కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
లింక్పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ వివరాలు ఎంటర్ చేయాలి.
సబ్మిట్ బటన్పై క్లిక్ చేసి అకౌంట్లోకి లాగిన్ అవ్వాలి.
అప్లికేషన్ ఫామ్ నింపి అప్లికేషన్ ఫీజు చెల్లించాలి..
ఆ తర్వాత సబ్మిట్ నొక్కి పేజ్ ను డౌన్లోడ్ చేసుకోండి.. అలాగే హార్డ్ కాపీని డౌన్లోడ్ చేసుకోవాలి.. ఈ పోస్టుల గురించి మరింత సమాచారం కోసం అధికార వెబ్ సైట్ ను సందర్శించి అప్లై చేసుకోగలరు………