Inter Student: ఆర్టీసీ బస్సు కింద పడి విద్యార్థిని మృతి..
Inter Student: ఆర్టీసీ బస్సు కింద పడి విద్యార్థిని మృతి..
మధురా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యూసుఫ్ గూడలో ఘటన. యూసుఫ్‌గూడ లోని మాస్టర్స్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న మృతురాలు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
హైదరాబాద్‌లోని ఓ ఇంటర్మీడియట్ విద్యార్థిని జూన్ 14 శుక్రవారం నాడు బస్సు దిగే ప్రయత్నంలో కదులుతున్న టిజిఎస్ ఆర్‌టిసి బస్సు చక్రాల కింద పడి మరణించిన దురదృష్టకర సంఘటన చోటు చేసుకుంది. మధురా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యూసుఫ్ గూడలో ఈ ఘటన చోటుచేసుకుంది. టీజిఎస్‌ఆర్‌టీసీ బస్సు ఆమెపై నుంచి వెళ్లడంతో బాధితురాలు మెహ్రీన్ అక్కడికక్కడే మృతి చెందింది. మరణించిన అమ్మాయి హైదరాబాద్ లోని యూసుఫ్‌గూడ లోని మాస్టర్స్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది.
విద్యార్థి బస్సు చక్రాల కింద ఎలా జారి పడిన ఘటనకు సంబంధించిన సిసిఫుటేజీలో రికార్డ్ కాగా.. ప్రస్తుతం అందుకు సంబంధించి ఆ వీడియో వైరల్ అవుతుంది. చనిపోయిన అమ్మాయిని మెహ్రీన్‌గా పోలీసులు గుర్తించారు. ఆపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.