JEE Advanced 2024 Results: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2024 ఫలితాలు విడుదల.. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
JEE Advanced 2024 Results: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2024 ఫలితాలు విడుదల.. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
జనరల్ కేటగిరీ అభ్యర్థులకు కనీస కటాఫ్ 93.2 పర్సంటైల్
2022, 2023లతో పోల్చితే గణనీయంగా పెరిగిన కటాఫ్ మార్కులు
జేఈఈ (జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్) అడ్వాన్స్‌డ్ 2024 ఫలితాలు విడుదలయ్యాయి. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) మద్రాస్ ఆదివారం ఉదయం ఫలితాలను ప్రకటించింది. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు కనీస కటాఫ్ 93.2 పర్సంటైల్‌గా ఉంది. కాగా కటాఫ్ పర్సంటైల్ 2023లో 90.7, 2022లో 88.4గా ఉండగా ఈసారి అంతకంటే ఎక్కువగా ఉంది.
ఐఐటీ ఢిల్లీ జోన్‌కు చెందిన వేద్ లహోటి 360 మార్కులకు 355 సాధించి సీఆర్ఎల్‌లో (కామన్ ర్యాంక్ లిస్ట్) టాపర్‌గా నిలిచాడు. ఇక ఐఐటీ బాంబే జోన్‌కు చెందిన ద్విజా ధర్మేశ్ కుమార్ పటేల్ 360 మార్కులకు 332 సాధించి సీఆర్ఎల్-7తో టాప్ మహిళా ర్యాంకర్‌గా నిలిచింది. ఈ మేరకు కామన్ ర్యాంక్ లిస్ట్, కేటగిరీ ర్యాంకుల జాబితాను ఐఐటీ మద్రాస్ విడుదల చేసింది. కాగా జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష మే 26, 2024న దేశవ్యాప్తంగా జరిగింది. రెండు సెషన్‌లలో జరిగింది. ఆన్సర్ కీ జూన్ 2న విడుదలవగా.. టాప్ 2.5 లక్షల మంది విద్యార్థులు మాత్రమే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించారు. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు కటాఫ్ మార్కులు గణనీయంగా పెరిగాయి. కాగా అభ్యర్థులు జేఈఈఏడీవీ.ఏసీ.ఇన్ ( jeeadv.ac.in ) వెబ్‌సైట్‌ను సందర్శించి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. పేపర్ 1, పేపర్ 2 రెండింటి స్కోర్ కార్డ్‌లను చూడవచ్చు.