-Advertisement-

Liquor: మందు తాగేవారు ఎందుకు ఇవి ఎక్కువగా తింటారు..?

Health news health tips Telugu health benefits in Telugu health losses Lifestyle telugu news benefits of drinking alcohol Disadvantages of alcohol
Pavani

Liquor: మందు తాగేవారు ఎందుకు ఇవి ఎక్కువగా తింటారు..?

మద్యంతో పాటు కొన్ని రకాల ఆహారాలు తీసుకుంటే మంచిది..

ఆల్కహాల్తో పాటూ తినాల్సిన ఆహార పదార్థాలేంటో తెలుసుకోండి..

ఈ రోజుల్లో ఆల్కహాల్ తాగడం ఓ ఫ్యాషన్ అయిపోయింది. ఏ చిన్న కార్యక్రమమైనా, ఎవరి బర్త్ డే వేడుకలైనా సరే.. మద్యం బాటిల్ను తెరవడం తప్పనిసరి అయిపోయింది. నేటి యుగంలో గెట్- టుగెదర్లు, పార్టీలలో మద్యం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వీకెండ్ల కోసం ఎంతో మంది ఎదురుచూసేది ఈ ఆల్కహాల్ కోసమే. కానీ మద్యం తాగడం వల్ల శరీరంపై ఎన్నో ప్రతికూల ప్రభావాలు కూడా పడతాయి. అయితే మద్యం సేవించే సమయంలో కొన్ని విషయాలపై శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. ఆల్కహాల్ ఎల్లప్పుడూ నెమ్మదిగా, నీరు కలుపుకొని తీసుకోవాలి. కానీ ఆరోగ్యకరమైన ఆహారాలను తింటూ ఆల్కహాల్ సేవిస్తే శరీరంపై దాని ప్రభావం కొద్దిగా తక్కువగా ఉంటుంది. అలాగే రక్త ప్రవాహంలోకి ఆల్కహాల్ చేరడాన్ని నెమ్మదింపజేయవచ్చు. హ్యాంగోవర్, మత్తు వంటి వాటి ఈ ఆహారాలు అడ్డుకుంటాయి. దీన్ని బట్టి ఆల్కహాల్తో పాటు లేదా ఆల్కహాల్ తాగిన వెంటనే తినాల్సిన ఆహారాలు ఏమిటో తెలుసుకోండి.

Health news health tips Telugu health benefits in Telugu health losses in Telugu Health and fitness Lifestyle telugu news benefits of drinking liquor

పండ్లు, కూరగాయలు 

పండ్లు, కూరగాయలలో విటమిన్లు, ఖనిజాలు,యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి ఆల్కహాల్ వల్ల కలిగే ఆక్సీకరణ ఒత్తిడి, వాపును తగ్గించడంలో సహాయపడతాయి. అటువంటి పరిస్థితిలో, మీరు స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, నారింజకాయ వంటి పండ్లను తినవచ్చు. పాలకూర, కాలే వంటి ఆకుకూరలతో చేసిన ఆహారాలను తినాలి.

డ్రై ఫ్రూట్స్

డ్రై ఫ్రూట్స్, ఆల్కహాల్ మంచి జంటగా పేర్కొనబడతాయి. వాటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి, ఇవి ఆల్కహాల్ శోషణను నెమ్మదింపజేయడంలో సహాయపడతాయి. దీనితో పాటు ఇవి కండరాల తిమ్మిరిని నివారిస్తాయి. నిద్రను మెరుగుపరుస్తాయి.

గుడ్డు

గుడ్లలో నాణ్యమైన ప్రొటీన్ లభిస్తుంది. ఇది సిస్టీన్ వంటి అమైనో ఆమ్లాలను కలిగి ఉంటుంది, ఇది ఆల్కహాల్ ఉప ఉత్పత్తి అయిన ఎసిటాల్డిహైడ్ను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది. మీ డైట్లో గుడ్లను చేర్చుకోవడం వల్ల కాలేయం మంచిగా పని చేయడంలో సహాయపడుతుంది. హ్యాంగోవర్ల తీవ్రతను తగ్గిస్తుంది.

అవకాడో

అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. వీటిని ఆల్కహాల్తో తినడం మంచిది. కొవ్వు జీర్ణం కావడానికి సమయం పడుతుంది, ఇది ఆల్కహాల్ శోషణను నెమ్మదిస్తుంది. ఆరోగ్యకరమైన కొవ్వులు మెదడు ఆరోగ్యానికి ముఖ్యమైనవి. మద్యపానంతో సంబంధం ఉన్న హానిని తగ్గించడంలో సహాయపడతాయి.

లీన్ ప్రోటీన్లు ఉండే ఆహారం 

లీన్ ప్రోటీన్లు ఉండే ఆహారం అంటే.. చికెన్, చేపలు, బీన్స్, చిక్కుళ్ళు వంటి వాటిలో ఈ ప్రోటీన్లు ఉంటాయి. ఈ లీన్ ప్రోటీన్లు ఉండే ఆహారాన్ని తినడం వల్ల ఆల్కహాల్ శోషణశరీరంలో మందగిస్తుంది. ప్రోటీన్లు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి ఆల్కహాల్ మీ రక్త ప్రవాహంలోకి ఒకసారి చేరే అవకాశం ఉండదు. ఇది రక్తంలో ఆల్కహాల్ గాఢతను నిరోధించడంలో సహాయపడుతుంది. మత్తు రాకుండా అడ్డుకుంటుంది.

Comments

-Advertisement-