MRI scan: తక్కువ ధరకే మాగ్నెటిక్ రెసోనెన్స్ ఇమేజింగ్ యత్రం..
తక్కువ ధరకే మాగ్నెటిక్ రెసోనెన్స్ ఇమేజింగ్ (MRI) యంత్రం..
- హాంకాంగ్ శాస్త్రవేత్తల అభివృద్ధి
- తగ్గనున్న ఎంఆర్‌ఐ స్కాన్ ధర
> MRI స్కానింగ్ చేయించడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. అలాగే, వెయిటింగ్ పీరియడ్ ఎక్కువగా ఉంటుంది. MRI స్కానింగ్ పరీక్షకు ఇంత ఎక్కువ ధర ఉండటానికి ప్రధాన కారణం ఈ పరీక్ష చేసే యంత్రం అధిక ఖర్చుతో కూడుకున్నది.
> దీనికి పరిష్కారంగా ప్రస్తుతం వినియోగంలో ఉన్న MRI స్కానింగ్ యంత్రాలతో పోలిస్తే దాదాపు 50 రెట్లు తక్కువ ధరలో హాంకాంగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందం చౌకైన మాగ్నెటిక్ రెసోనెన్స్ ఇమేజింగ్(MRI) యంత్రాన్ని తయారుచేసింది.మన దేశంలో 3-టీ MRI మెషీన్ ధర దాదాపుగా రూ.9 కోట్ల నుంచి రూ.13 కోట్ల వరకు ఉంటుంది. దీనికి అవసరమైన సదుపాయాల కోసం మరింత ఖర్చు అవుతుంది. ఇంత భారీ ధర పెట్టె MRI యంత్రం కొనుగోలు చేయడం వల్ల పరీక్షకు సైతం ఎక్కువగా ధర వసూలు చేస్తున్నారు.
> ధర ఎక్కువగా ఉండటం వల్ల పేదలు అవసరమైనప్పుడు MRI పరీక్ష చేయించుకోలేకపోతున్నారు. ఈ పరిస్థితిని గుర్తించిన హాంకాంగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ కొత్త MRI యంత్రాన్ని తయారుచేశారు. దీని ధర దాదాపు 22 వేల డాలర్లు(రూ.18.4 లక్షలు) ఉంటుంది. తక్కువ సామర్థ్యం గల 0.05 టెస్లా(టే) అయస్కాంతాలతో ఈ కొత్త MRI యంత్రాన్ని తయారుచేశారు. సాధారణ MRI యంత్రాన్ని ప్రత్యేక రక్షణ కలిగిన గదిలో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇందులోని అయస్కాంతాలను చల్లబరిచేందుకు లిక్విడ్ హీలియం వాడతారు. దీనికి విద్యుత్తు సదుపాయం కూడా వేరుగా ఇవ్వాల్సి ఉంటుంది.
> సాధారణ MRI యంత్రాన్ని ప్రత్యేక రక్షణ కలిగిన గదిలో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇందులోని అయస్కాంతాలను చల్లబరిచేందుకు లిక్విడ్ హీలియం వాడతారు. దీనికి విద్యుత్తు సదుపాయం ఈ కొత్త MRI యంత్రాన్ని మాత్రం సాధారణ గదిలోనే ఏర్పాటు చేయవచ్చని, దీనికి హీలియం కూలెంట్ అవసరం లేదని, మామూలు విద్యుత్తు ఔట్లెట్లోనే వినియోగించవచ్చు.
> ఈ కొత్త MRI యంత్రం యొక్క ధర తక్కువ. నిర్వహణ సులభం, మరియు విద్యుత్తు వినియోగం కూడా తక్కువే. అయితే, 3T MRI యంత్రంతో పోలిస్తే ఈ 0.05టీ MRI యంత్రంలో ఇమేజ్ నాణ్యత తక్కువగా ఉంటుందని పలువురు వైద్యులుఅభిప్రాయపడుతున్నారు. దీనికి పరిష్కారంగా AIని వినియోగిస్తున్నామని. AJ ద్వారా ఇమేజ్ నాణ్యతను పెంచొచ్చు గుండె, మెదడు, ఎముకల సంబంధ సమస్యలను తెలుసుకోవడానికి, క్యాన్సర్లను గుర్తించడానికి వైద్యులు ఎక్కువగా పేషెంట్లకు MRI స్కానింగ్ చేయిస్తారు.