NH: నేషనల్ హైవే పై ఘోర రోడ్డు ప్రమాదం..అక్కడికక్కడే ఇద్దరు దుర్మరణం
NH: నేషనల్ హైవే పై ఘోర రోడ్డు ప్రమాదం..అక్కడికక్కడే ఇద్దరు దుర్మరణం
కామారెడ్డి, (పీపుల్స్ మోటివేషన్):-
కామారెడ్డి జిల్లా మీదిగా వెళుతున్న నేషనల్ హైవే 161 ఘోర రోడ్డు ప్రమాదం సంబంధించింది. పెద్దకొడపగల్ మండలం బేగంపూర్ గేటు వద్ద రోడ్డు దాటే క్రమంలో ద్విచక్ర వాహనాన్ని హైదరాబాద్ నుండి దెగ్లూరు వెళ్తున్న ఫార్చునర్ వాహనం అతివేగంగా ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న మానేపూర్ గ్రామానికి చెందిన రియాజుద్దీన్,శాంతాపూర్ గ్రామానికి చెందిన శివరాం అక్కడికక్కడే మృతి చెందారు.
విషయం తెలుసుకున్న గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకొని బాధ్యులతో మాట్లాడిన తర్వాతనే శవాలను తరలిస్తామని పోలీసులతో వాగ్విదానికి దిగారు. దీంతో స్పందించిన అధికారులు వారితో చర్చించి మృతులను పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించమని స్థానిక ఎస్సై కోనారెడ్డి తెలిపారు.సంఘటన స్థలానికి పిట్లం ఎస్సై నీరేష్, బిచ్కుంద ఎస్సై, మద్నూర్ పోలీసులు సైతం వచ్చి ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి గ్రామస్తులకు సర్ది చెప్పారు. అనంతరం కేసు నమోదు చేసుకుని విచారణ చేపడతామని ఎస్సై కోన రెడ్డి తెలిపారు.