Noodles: నూడిల్స్ ఇష్టంగా తింటున్నారా.. అయితే ఇది తెలుసుకోండి..??
Noodles: నూడిల్స్ ఇష్టంగా తింటున్నారా.. అయితే ఇది తెలుసుకోండి..??
చాలా రుచిగా ఉంటాయి. వండటానికి సమయం కూడా ఎక్కువసేపు పట్టదు. దీని కారణంగా పిల్లలు, పెద్దలు కూడా వీటని తినడం పట్ల చాలా ఆసక్తి చూపిస్తారు. సాయంత్రం పూట స్నాక్స్ గా అయినా, బాగా ఆకలి దంచేస్తున్న సమయంలో అయినా నూడిల్స్ కే ఓటు వేస్తారు. ఇక పిల్లలు అయితే నూడిల్స్ కోసం చాలా అల్లరి చేస్తారు.
నూడిల్స్ ఇప్పట్లో చాలామందికి ఇష్టమైన ఆహారం. ఇవి చాలా రుచిగా ఉంటాయి. వండటానికి సమయం కూడా ఎక్కువసేపు పట్టదు. దీని కారణంగా పిల్లలు, పెద్దలు కూడా వీటని తినడం పట్ల చాలా ఆసక్తి చూపిస్తారు. సాయంత్రం పూట స్నాక్స్ గా అయినా, బాగా ఆకలి దంచేస్తున్న సమయంలో అయినా నూడిల్స్ కే ఓటు వేస్తారు. ఇక పిల్లలు అయితే నూడిల్స్ కోసం చాలా అల్లరి చేస్తారు. నిజానికి నూడిల్స్ ఆరోగ్యానికి అంత మంచిది కాదని తెలిసినా సరే.. ఎలాంటి సంకోచం లేకుండా తింటారు. చాలామందికి ఈ నూడిల్స్ గురించి తెలియని కొన్ని నిజాలున్నాయి. అవేంటో తెలుసుకుంటే..
ఇన్స్టంట్ నూడిల్స్ లో శరీరానికి అవసరమైన పోషకాలు ఏమీ ఉండవు. నూడిల్స్ ప్యాకెట్ల మీద రాసినట్టు ప్రోటీన్లు, విటమిన్లు, ఎనర్జీ ఇలాంటివి ఏమీ ఇన్స్టంట్ నూడిల్స్ తినడం వల్ల లభించవు. వీటిని ఆహారంలో ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు.
ఇన్స్టంట్ నూడిల్స్ లో కృత్రిమ రుచులు, ప్రిజర్వేటివ్ లు, రంగులు ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి కీడు చేస్తాయే తప్ప ఏమాత్రం మేలు చేయవు. అందుకే నూడిల్స్ తినాలని అనిపించినా ఎప్పుడో ఒకసారి తీసుకోవాలి. ఆరోగ్యం బాగుండాలంటే ఆ ఒక్కసారి కూడా మినహాయించ్చు.
చాలామందికి తెలియని నిజం ఏంటంటే.. ఇన్స్టంట్ నూడిల్స్ లో అధిక మొత్తంలో సోడియం ఉంటుంది. ఇది అధిక రక్తపోటుకు కారణం అవుతుంది. బిపి ఎక్కువగా ఉన్నవారు ఇన్స్టంట్ నూడిల్స్ జోలికి అస్సలు వెళ్లకూడదు. అంతేకాదు అధిక సోడియం శరీరంలో ఎముకలను దెబ్బతీస్తుంది. ఎముకల ఆరోగ్యం బాగుండాలంటే ఈ నూడిల్స్ ను అవాయిడ్ చెయ్యాలి. చిన్న పిల్లలలో ఎముకలు బలహీనంగా ఉండటానికి కూడా ఇవి కారణమవుతాయి.
పిల్లలలో ఏకాగ్రత పెరగాలంటే ఈ యోగా ఆసనాలు ట్రై చేయండి..!
ఫ్రైడ్ నూడిల్స్ లో ఎక్కువ మొత్తంలో అనారోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. కొలెస్ట్రాల్ సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు, అధిక బరువు ఉన్నవారు, కుటుంబంలో గుండె జబ్బుల హిస్టరీ ఉన్నవారు వీటికి దూరంగా ఉండటం చాలామంచిది.
నూడిల్స్ లో కేలరీలు ఎక్కువ, పోషకాలు ఉండవు, ఫైబర్ ఏ మాత్రం ఉండదు. పైపెచ్చు శరీరానికి కీడు చేసే కృత్రిమ రంగులు, కృత్రిమ రుచులు ఉంటాయి. వీటి వల్ల బరువు పెరగడం, ఊబకాయం చాలా తొందరగా వస్తుంది.